NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ రెండు చోట్లా జ‌గ‌న్ యూట‌ర్న్‌.. పాత నేత‌ల‌కే ప‌ట్టం…!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ మార్పుల వ్యూహం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఉన్న‌వారిని వేరే చోటకు.. వేరే చోట ఉన్న వారిని ఇంకో చోట‌కు త‌ర‌లించింది. ఈ ప్ర‌యోగం ద్వారా.. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై ఉన్న వ్య‌తిరేక‌త పోయి.. పార్టీ ప‌రుగులు పెడుతుంద‌ని, గెలుపు గుర్రం ఎక్కుతుంద‌ని వైసీపీ ఆశిస్తోంది. ఇది ఏమేర‌కు సక్సెస్ అవుతుంద‌నేది ప‌క్క‌న పెడితే..ఆదిలోనే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ఇబ్బందులు వ‌స్తున్నాయి. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో యూట‌ర్న్ తీసుకోక త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నంలోని రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో చేసిన మార్పులు వైసీపీకి మైన‌స్‌గా మారాయ‌ని అంటున్నారు. వీటిలో ఒక‌టి గాజువాక‌, రెండో నియోజ‌క‌వర్గం అన‌కాప‌ల్లి. ఈ రెండు కూడా వైసీపీ కి చాలా ప్ర‌త్యేక‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు. గాజువాక‌లో ఏకంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ను ఓడించిన తిప్ప‌ల నాగిరెడ్డి ఉన్నారు. ఇక‌, అన‌కాప‌ల్లిలో ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ఉన్నారు. అయితే.. రెండో జాబితాలో వైసీపీ వీరిని మార్చేసింది.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అనూహ్య‌మైన మార్పులు చేసింది. గాజువాక నుంచి కార్పొరేట‌ర్ స్థాయి నాయ‌కుడు.. ఉరుకూటి రామ‌చంద్ర‌రావును, అన‌కాప‌ల్లి నుంచి సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌.. మ‌ల‌సాల భ‌ర‌త్ కుమార్‌ను ప్ర‌క‌టించింది. ఈ మార్పుపై కొంత అసంతృప్తి వ్య‌క్త‌మైనా.. అధిస్టానం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. తాము చేసిన మార్పుల‌కు క‌ట్టుబడి ఉండాల‌ని సంకేతాలు పంపించింది. దీంతో సిట్టింగులు సైలెంట్ అయ్యారు. కానీ, కొత్త‌గా వ‌చ్చిన ఇంచార్జ్‌లు పుంజుకోలేక పోతున్నారు.

ఇద్ద‌రూ కూడా.. బ‌ల‌మైన నాయ‌కులుగా ఎద‌గ‌లేక పోతున్నార‌నే వాద‌న ఉంది. అంతేకాదు.. క్షేత్ర‌స్థాయి లో ప్ర‌జ‌ల నుంచి కూడా బ‌ల‌మైన గుర్తింపును పొంద‌లేక పోతున్నారు. పార్టీలో కార్య‌క‌ర్త‌ల‌ను కూడా స‌మ న్వ‌య ప‌ర‌చడంలో ఫిఫ్టీ-ఫిఫ్టీగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పైగా.. టీడీపీ-జ‌న‌సేన కూట‌మిని త‌ట్టుకునే సామ ర్థ్యం వీరికి ఉంటుందా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. దీనిపై పార్టీ కూడా దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం.

ఎందుకంటే.. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. ప్ర‌జ‌ల్లో పుంజుకోక‌పోయినా.. అంతిమంగా పార్టీకి ఈ రెండు సీట్లు పోయే చాన్స్ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో తిరిగిఇప్పుడున్న నాయ‌కుల‌కే అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌, ఎమ్మెల్యే తిప్ప‌ల‌నాగిరెడ్డికూడా.. వేచి చూస్తున్నారు. మ‌రి పార్టీ అధినేత సీఎం జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Related posts

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?