NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari February 16 2024 Episode 395: సంవత్సరం లోపు బిడ్డను పెద్దత్త గిఫ్టుగా ఇద్దామనుకుంటున్న కృష్ణ మురారి.. ముకుంద ప్లాన్ ఏంటి?

Krishna Mukunda Murari Today Episode February 16 2024 Episode 395 Highlights

Krishna Mukunda Murari February 16 2024 Episode 395: ముకుందతో ఆదర్శం మనం కాశ్మీర్ వెళ్లిపోదాం అని చెబుతాడు. అదేంటి ఆదర్శ్ ఇక్కడ అంతా బానే ఉంది కదా.. ఇప్పుడు కాశ్మీర్ ఎందుకు అని ముకుందా అడుగుతుంది. కాశ్మీర్ అందాలను చూస్తే నువ్వు అస్సలు వదలవు. అయినా అక్కడ చాలా బాగుంటుంది. ఆ లోయాలు ఆ స్వర్గం ఆ బ్యూటీ అవన్నీ నువ్వు చూడాలి ముకుందా అని ఆదర్శ్ అంటాడు. మురారి లేని చోట అది స్వర్గమైనా కూడా నాకు నరకం గానే అనిపిస్తుంది ఈ విషయాన్ని నేను నీకు ఎలా చెప్పాలి ఆదర్శ్.. నువ్వు రోజు రోజుకి నామీద ప్రేమను పెంచేసుకుంటున్నావు. ఎలాగైనా సరే నీకు నిజాన్ని చెప్పేయాలి. నిన్ను బయటకు తీసుకెళ్లి నీకు నిజాన్ని చెప్పేయాలి అని ముకుందా అనుకుంటుంది. వద్దు ఆదర్శ్ మనం ఇక్కడే ఉన్నాము. అత్తయ్య వచ్చిన తర్వాత ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం అని ముకుందా చెబుతుంది.

Krishna Mukunda Murari Today Episode February 16 2024 Episode 395 Highlights
Krishna Mukunda Murari Today Episode February 16 2024 Episode 395 Highlights

ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని ఉంటారు భోజనానికి ఇంకా ఏర్పాట్లు అవలేదని మధు అడుగుతాడు. అప్పుడు నీలాంటి డైరెక్టర్స్ ప్రేమ ఉంటే చాలు ప్రేమ ఉంటే తిండి తిప్పలు, డబ్బులు ఏమీ అవసరం లేదంటారు కదా.. ఈ రోజు ప్రేమ ఒక్కటి తిని బతికే చాలు అని అంటారు అప్పుడే కృష్ణ మురారి కిందకి వస్తారు. పెద్దత్తయ్యా ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేశారా అందులో ఏముంది అని అందరూ ఆత్రంగా అడుగుతారు. కానీ కృష్ణ మాత్రం అదేంటో ఓపెన్ చేయలేదు. ముకుందా ఆదర్శం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను అని కృష్ణ చెబుతోంది. మురారి ఆ గిఫ్ట్ బాక్స్ ని తీసుకువచ్చి కృష్ణను ఓపెన్ చేయమని ఇస్తాడు. కృష్ణ మురారి ఇద్దరు అందరి ముందు భవాని ఇచ్చిన గిఫ్ట్ ఏంటో అని ఓపెన్ చేసి చూస్తారు. అందులో కృష్ణ కి ఒక పీక నోటిలో పెట్టుకున్న అమ్మాయి బొమ్మ అని ఇస్తుంది. అందులో కృష్ణ కోసం ఒక లెటర్ కూడా రాసి ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 16 2024 Episode 395 Highlights
Krishna Mukunda Murari Today Episode February 16 2024 Episode 395 Highlights

మురారి ఆ లెటర్ ను ఓపెన్ చేసి చదువుతాడు. తింగరి నీలో ఓ అమ్మ ఉంది. నిజంగా నువ్వు అమ్మవైతే చూడాలని ఉంది. అలాగే నేను వెళ్ళిన తర్వాత నువ్వే మీ ఇంటికి నువ్వే ఇంచార్జి ఈ ఇంట్లో ఉన్న సమస్యలన్నింటినీ నువ్వే ఒక అమ్మ లాగా చక్కబట్టాలి ఇట్లు మీ అత్తయ్య భవాని. కృష్ణ నువ్వు తింగరి లాగా ఉంటావు. నీలాంటి తింగరి పిల్లకి కూడా అమ్మ అవ్వాలని ఆలోచన ఉంటుంది. నువ్వు నిజంగా అమ్మవైతే చూడాలని నాకు ఆశగా ఉంది. నువ్వు అమ్మ వి అవుతావు కదా అని భవాని రాసిన లెటర్ చూసి కృష్ణ భావోద్వేగానికి లోనవుతుంది. నిజంగా అత్తయ్యకు నా మీద ఎంత ప్రేమ ఉందని కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. అయినా ఈ లెటర్ నాకు ఒక్కదానికే కాదు ముకుంద కి కూడా తను కూడా తల్లి అవ్వాలని భవాని అత్తయ్య అనుకుంటుంది అని క్రిష్ణ అంటుంది. ఆ మాటకి ముకుంద ఆలోచనలో పడుతుంది. కృష్ణ మా అమ్మ వచ్చేసరికి నువ్వు ఓ పాపని తన చేతిలో పెడతావని నందిని అడుగుతుంది. అయినా ఈ మాట నా ఒక్కదానికే కాదు ముకుంద కి కూడా అని కృష్ణ అంటుంది. అమ్మో ఈ విషయాన్ని ఇంకా పొడిగిస్తూ ఉంటే నా వల్ల కాదు. ఆదర్శ్ ని బయటకు తీసుకువెళ్లి ఈ విషయాన్ని తొందరగా చెప్పేయాలి అని ముకుందా మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 16 2024 Episode 395 Highlights
Krishna Mukunda Murari Today Episode February 16 2024 Episode 395 Highlights

తింగరి మాకంటే ముందే మీరే ఒక పాపని కనిచ్చి పెద్దయ్యకు ఇవ్వాలి అని ముకుందా అంటుంది. నీ తర్వాతే మేము కనిస్తాము అని ముకుందా అంటుంది. నువ్వు నన్ను తింగరి అని పిలిచావా ఈ ఒక్క మాట చాలు నీలో మార్పు వచ్చింది అని చెప్పడానికి అని కృష్ణ సంతోషిస్తూ ముకుందతో అంటుంది. కృష్ణ నేను నిన్ను ఒక మాట అడగాలి. ఇప్పుడు నువ్వే ఇంటికి ఇంచార్జివి కదా ఆది వచ్చినప్పటి నుంచి మా నలుగురం కలిసి బయటికి వెళ్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. నువ్వు ఏమంటావు అని ముకుందా అడుగుతుంది. కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతూ రేవతి దగ్గర రేపు ఎల్లుండి వెళ్లి రావడానికి పర్మిషన్ తీసుకుంటుంది. కానీ ఆదర్శ్ మాత్రం ముకుంద మనసులో నాకు నిజంగానే స్థానం ఉందా మరి ఎందుకు తన గదిలో ఇంకా మురారితో కలిసి ఉన్న ఫోటో ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. నేనే ముకుంద గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను అని ఆదర్శ్ మనసులో అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode February 16 2024 Episode 395 Highlights
Krishna Mukunda Murari Today Episode February 16 2024 Episode 395 Highlights

కృష్ణ తన గదిలో భవాని ఇచ్చిన బొమ్మ పట్టుకొని దానిని చూస్తూ సంతోష పడుతూ ఉంటుంది అప్పుడే మురారి అక్కడికి వస్తాడు నువ్వు పెద్దమ్మ ఇచ్చిన బొమ్మను చూస్తూ ఉండటమే కాదు తను చెప్పిన మాటను కూడా నెరవేర్చాలి అని అంటాడు అప్పుడు సంవత్సరం తిరిగేసరికల్లా పెద్ద చేతులు బుల్లి మేడంని పెట్టి తీరాదం అని కృష్ణ అంటుంది. ఇక నువ్వు ఈ మాట చెబితే చాలు. ఇప్పుడు లైన్ లోకి వచ్చావు కృష్ణ అంటూ మురారి గబగబా ఆ గది తలుపులన్నీ వేసేసి రూమ్ లో ఫ్రెషనర్ కొట్టి కృష్ణను మురారి దగ్గరకు తీసుకుంటాడు ఎసిపి సార్ అంటూ కృష్ణ అరుస్తుంది. అప్పుడు ఈ గదిలో పూల పరిమళం లేకపోయినా పర్వాలేదు నీ మనసు నాకు దగ్గర అయితే చాలు మన ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడడానికి వీల్లేదు అని కృష్ణ నీ మురారి దగ్గరగా తీసుకుంటాడు ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode February 16 2024 Episode 395 Highlights
Krishna Mukunda Murari Today Episode February 16 2024 Episode 395 Highlights

రేపటి ఎపిసోడ్ లో ఇద్దరు జంటలు కలిసి ట్రిప్ కి బయటకు బయలుదేరుతారు. ఈసారి ఆదర్శ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ముకుందా పక్కన కూర్చుని ఉంటుంది. ఇక బ్యాక్ సీట్లో కృష్ణ మురారి కూర్చొని ఉంటాడు. మురారి కృష్ణ చేయని లాక్కొని తనతో మాట్లాడుతూ ఉండగా ముకుంద కుల్లుకుంటు ఉంటుంది. మురారి తనకి తలనొప్పిగా ఉందని మసాజ్ చేయమని కృష్ణ ఒడిలో మురారి పడుకుంటాడు. కృష్ణ మురారి కి మసాజ్ చేస్తూ ఉండగా ఆ సీన్స్ చూసి ముకుందా తట్టుకోలేక పోతుంది . ఇక ముకుంద వాల్లిదరు దగ్గర కాకుండా ఏం చేస్తుందో తర్వాత భాగంలో చూద్దాం.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella