Breaking: ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో రేప్స్ మరియు అనేక ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఎన్నో సదుపాయాలు తీసుకొచ్చినప్పటికీ ఆగడం లేదు. ఇక ఇలాంటివి ఎక్కువగా సినీ సెలబ్రిటీలకి జరుగుతున్నాయి. నిన్నేమో యూట్యూబర్ షణ్ముఖ్ డ్రగ్స్ కేసులో పట్టుబడగా నేడు ప్రముఖ యూట్యూబర్ పక్కింటి కుర్రాడుగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన చందు సాయి రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు.
హైదరాబాద్లోని నర్సింగి కి చెందిన ఓ అమ్మాయి ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసు బృందం చందు పై యాక్షన్ తీసుకుంది. ప్రేమ పేరుతో తనను మోసం చేసి రేప్ చేశాడని ఆ యువకురాలు ఫిర్యాదు చేసింది. ఇక చందు కొంతకాలం కిందట పక్కింటి కుర్రాడు అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించాడు. ఆరేళ్లగా తన చానల్లో ఫన్నీ వీడియోస్ షేర్ చేస్తూ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన యూట్యూబ్ ఛానల్ కి ఏకంగా 13 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరారు.
అలాంటి వ్యక్తి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువకురాలు ఫిర్యాదుతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. మొదట తనని ప్రేమిస్తున్నానని తెలిపాడని అనంతరం తనపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆ యువతి తెలియజేసింది. ఏప్రిల్ 25.. 2021న చందు సాయి తనను రేప్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. తన బర్తడే సెలబ్రేషన్స్ అని చెబుతూ తనను ఏ మార్చినట్లు తెలియజేసింది. ఇక ఆ యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు.
ఇక తాజాగా చందు సాయి తనని తాను సమర్ధించుకుంటూ ఓ పోస్ట్ షేర్ చేశాడు. “అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లాంటివి పెట్టుకోకండి. తప్పు జరిగిందంటే అది ఇద్దరూ చేసినట్లే కానీ దెబ్బ మాత్రం అబ్బాయికి పడుతుంది. రేప్ లు లాంటివి మనమెందుకు చేస్తాము. రిలేషన్షిప్ లో ఇద్దరూ ఉన్నాము. కాపాడుకోవాలని చూస్తాము. అది వర్కౌట్ కాలేదు కానీ కేసు నామీద వేశారు ” అంటూ ఓ ట్వీట్ ని షేర్ చేశాడు చందు. ప్రస్తుతం ఈయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.