NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 19 2024 Episode 422: కృష్ణ మురారిలకి యాక్సిడెంట్.. ముకుంద చేయించిందా.?

Krishna Mukunda Murari Today Episode  March 19 2024 Episode 422 highlights

Krishna Mukunda Murari March 19 2024 Episode 422: మధు తన గదిలో నిద్రపోకుండా హాల్లోకి వచ్చి నిద్రపోతాడు. ఏమైంది ఎక్కడ నిద్రపోయావని నందిని పిలుస్తుంది. అప్పుడు ముకుందా ముకుందా అని పెద్దగా మధు అరుస్తారు. అప్పుడు ముకుంద కాదు నేను నందిని అని అంటుంది. ఇప్పుడు నీకు ముకుంద ఎందుకు గుర్తొచ్చింది మధు. ఇంతకీ ఏమైందో చెప్పరా అని మధు ని అడుగుతుంది. ఇందాక నేను మందు తాగడానికి బయట లాన్ లో కూర్చున్నప్పుడు నాకు ముకుంద కనిపించింది. తనని నేను తిట్టుకుంటూ మందు తాగాను. నన్ను ఎలా తిట్టుకుంటావు. తప్పంతా కృష్ణది కదా అని చెప్పి తను నన్ను బెదిరించింది. అంతేకాదు ఇంకోసారి ముకుందా గురించి తప్పుగా మాట్లాడితే ఇంకేమైనా చేస్తాను నిన్ను అని నాకు వార్నింగ్ ఇచ్చింది. అమ్మో ఇంకా నన్ను ఏమైనా చేస్తుందేమో అని నాకు భయంగా. నేను ఒంటరిగా నా గదిలో పడుకుంటే ఇంకేమైనా ఉందా.. ఏ నిద్రలోనే వచ్చి నన్ను చంపేస్తుంది అని మధు ఇంట్లో వాళ్ళందరూ ముందు పెద్ద పెద్దగా చెబుతూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode  March 19 2024 Episode 422 highlights
Krishna Mukunda Murari Today Episode  March 19 2024 Episode 422 highlights

అప్పుడే మురారి అక్కడికి వస్తాడు. ఏయ్ మధు అలాంటిది ఏమి ఉండదు. ఇదంతా కేవలం నీ బ్రమ మాత్రమే. నువ్వు ముందు నీ బ్రమలో నుంచి బయటకు రా ఇప్పుడు ఒక రెండు మూడు పెగ్గులు వేసి వచ్చావనుకో ఇక ఆ భ్రమలో నుంచి బయటికి వస్తావు. హాయిగా నిద్రపోతావు అని మధుకి మురారి సలహా ఇస్తాడు. సరే అయితే అని మధు ధైర్యంగా బయటికి వెళ్తాడు ఇప్పుడు చూసుకుంటాను అని విర్రవాగుడు వాగుతూ ఉంటాడు. లోలోపల మాత్రం ముకుంద ఎక్కడ వస్తుంది అని భయపడుతూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode  March 19 2024 Episode 422 highlights
Krishna Mukunda Murari Today Episode  March 19 2024 Episode 422 highlights

మురారి కృష్ణ దగ్గరికి వెళ్లి రేపు మన ఇద్దరం కలిసి హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్ళాలి. అందుకు కావలసిన సారీని నేనే సెలెక్ట్ చేస్తున్నాను అని మురారి కృష్ణ కోసం మురారి మంచి సారిని సెలెక్ట్ చేసి ఇస్తాడు. మురారి మనసులో మాత్రం ముకుంద నేను కృష్ణకి దగ్గరగానే ఉంటాను, నువ్వు మాత్రం నన్ను కృష్ణని దూరం చేయలేవు. ఇందాక నువ్వు ఏమన్నావు కృష్ణకి నేను ఎంత దగ్గరైతే తన ఆయుష్ అంత తగ్గుతుంది అని అన్నావు కదా.. ఇప్పుడు నేను కృష్ణకి అంతే దగ్గరగా ఉంటాను. నువ్వేం చేస్తావో చేసుకో.. అయినా నువ్వేం చేయలేవు. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో లేవు కదా నేను ఇక కృష్ణతో సంతోషంగా ఉంటాను. నీ చేతనైనది నువ్వు చేసుకో అని మురారి మనసులో అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode  March 19 2024 Episode 422 highlights
Krishna Mukunda Murari Today Episode  March 19 2024 Episode 422 highlights

ఇక ఉదయం నిద్ర లేచిన తర్వాత కృష్ణ రెడీ అయి వచ్చేసరికి మురారి కృష్ణ కోసం కాఫీ తీసుకొస్తాడు. అంతే కాకుండా తన తల కూడా తనే తుడుస్తాను అని కృష్ణతో మురారి చెబుతాడు. ఏంటి ఏసిపి సార్ ఈరోజు మీకు ఏమైంది నాకోసం కాఫీ తీసుకువచ్చారు. తల కూడా మీరే తుడుస్తాను అంటున్నారు ఏమైంది అని కృష అడుగుతుంది. మీ ఆడవాళ్లంతా ఇంతే.. ప్రేమ చూపిస్తే చూపిస్తున్నామని అంటారు చూపించకపోతే చూపించలేదు అంటారు. మీతో ఎలా ఉండాలో అర్థం కావడం లేదు అని మురారి అంటాడు. ఇక కృష్ణని కాఫీ తాగిన తర్వాత మురారి వెనక్కి తిప్పి తన తల తుడుస్తాడు. కృష్ణ గబగబా రెడీ అవుతుంది. హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్దాము కానివ్వు అని మురారి అంటారు. ఇక ఇద్దరూ రెడీ అయిన తర్వాత కిందకి దిగుతూ ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode  March 19 2024 Episode 422 highlights
Krishna Mukunda Murari Today Episode  March 19 2024 Episode 422 highlights

ఆదర్శ్ కిందకి వచ్చి ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మరి ఆదర్శమైన జంట ఏది ఇంకా కనిపించలేదు అని ఆదర్శ వంకరగా మాట్లాడుతున్న మాటలకి ఇంట్లో వాళ్ళందరికీ కోపం వస్తుంది. ఏంటి ఆదర్శ ఉండేకొద్ది ఇలా తయారవుతున్నావు అని మధు అడుగుతాడు. ఇక వాళ్ళిద్దరూ కిందకి రాగానే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే బయటికి వెళ్తున్నామని కృష్ణ మురారి ఇద్దరు అంటారు. అయితే ఎవరి కొంపలు కుల్చడానికి ఇప్పుడు మీరు వెళ్తున్నారు అని ఆదర్శ అంటాడు. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆదర్శ అలా వంకరగా మాట్లాడడం చూసి వాళ్ళందరూ కంగు తింటారు. ఇక కృష్ణ మురారిని ఏమి మాట్లాడద్దు అని చెప్పి కంట్రోల్ చేస్తుంది. కృష్ణ అందరితో మంచిగా ఉండే మేక వన్నె పులి అని ఆదర్శ్ కృష్ణ మురారి లను చూస్తూ గా మాట్లాడుతూ ఉంటాడు. కోపం వచ్చిన మధు ఇంకోసారి కృష్ణ మురారిలో నువ్వేమైనా అంటే నేనే నిన్ను చంపేస్తాను అని అంటాడు. వీళ్ళందరికీ వాళ్ళ బ్రతుకుల మీద ఆశ ఉందేమో.. నాకు మాత్రం ఎలాంటి ఆశ లేదు. నేను నిన్ను ఏమైనా చేయగలను అని మధు ఆదర్శ్ ని బెదిరిస్తాడు. మధు నువ్వేం మాట్లాడొద్దు అని కృష్ణ చెబుతుంది. ఇక కృష్ణ మురారి ఇద్దరు బయటకు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. మధు నేను పైన గదిలో ఉంటాను రా చంపుతాను అన్నావు కదా అని ఆదర్శ గదిలోకి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Today Episode  March 19 2024 Episode 422 highlights
Krishna Mukunda Murari Today Episode  March 19 2024 Episode 422 highlights

కృష్ణ మురారి ఇద్దరు హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్లాలని చెప్పి ఇద్దరూ కలిసి బైక్ మీద వెళుతూ ఉంటారు. ఇంకా ఐదు నిమిషాల్లో నేను చేరుకోవాల్సిన ప్లేస్ కి చేరుకుంటాను ముకుందా.. ఇప్పుడు నేను కృష్ణయ్య తోనే కలిసి ఉన్నాను నువ్వు నన్ను ఏమీ చేయలేవు. కృష్ణను నన్ను నువ్వు ఏం చేయాలేవు నువ్వు ఇంకా నన్ను ఏం చేయలేవు అని మురారి అనుకుంటుండగా.. కృష్ణ చీర కొంగు వెళ్లి బైక్ టైర్లో ఇరుక్కొని అనుకోకుండా బైక్ మీద నుంచి ఇద్దరు పడిపోతారు. కృష్ణ మురారి ఇద్దరికీ బైక్ యాక్సిడెంట్ అవుతుంది. ఇక స్పృహలోకి వచ్చిన మురారి వెంటనే కృష్ణని పైకి లేపి నీకు ఏం కాలేదు కదా అని అడుగుతాడు. ఏం కాలేదు మీరు బానే ఉన్నారు కదా అని కృష్ణ అడుగుతుంది. నేను ఓకే అని చెబుతాడు . అప్పుడే కృష్ణ అతను చీర కొంగు బైక్ లో ఇరుక్కుంది అని చెప్పగానే మురారి ఆ చీర కొంగును జాగ్రత్తగా వేయుటకు తీస్తూ ఉండగా ముకుందా అటుపక్కగా కార్ టెంపో పైనుంచి కనిపిస్తుంది. ముకుందని చూసి మురారి షాక్ అవుతాడు.

రేపటి ఎపిసోడ్ లో మురారి వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. ఏంటి సార్ ఇలా వచ్చారు అంటే మీ మీద నాన్ బైబుల్ వారెంట్ ఇష్యూ అయిన కారణంగా ఎక్కడికి వచ్చాము. మీరే ముకుంద చావు కి కారణం. అని మాకే కంప్లైంట్ వచ్చింది ఇక మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్ కి రాక తప్పదు మీరు మాతో పాటు రండి అని పోలీసులు మురారిని తీసుకువెళ్తారు కానీ కృష్ణ మాత్రం తీసుకువెళ్లొద్దు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు అని అడ్డుపడుతూ ఉంటుంది కానీ కృష్ణ మాత్రమే వాళ్ళు లెక్కచేయకుండా మురారిని పోలీస్ ట్రీబులో ఎక్కించుకుని తీసుకువెళ్తారు

Related posts

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N