NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ప్రకటన .. పింఛన్ల పంపిణీ ఇలా.

AP Pension Distribution: ఏపీలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ పై నిషేదం విధిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. పింఛన్ల పంపిణీకి సంబంధించి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి టీడీపీ, చంద్రబాబు కారణం అంటూ అధికార వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ నిలిచిపోవడంతో లబ్దిదారులైన అవ్వా తాతలు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడతారని అంటున్నారు. వైసీపీ విమర్శలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. పింఛన్ల పంపిణీ చేయకుండా టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ విష ప్రచారం చేస్తుందని ఆయన అన్నారు. ఈసీ ఆదేశాలను వక్రీకరించి ఎన్నికల్లో లబ్దిపొందాలని వైసీపీ చూస్తున్నారని అన్నారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో పింఛన్ల పంపిణీ నిలిపివేసినట్లు లబ్దిదారులకు సమాచారం చేరవేయాలని వైసీపీ కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఓటర్లను ప్రభావితం చేస్తారనే వాలంటీర్ల చేత పింఛన్ల ను పంపిణీ చేయవద్దని ఈసీ చెప్పిందన్నారు.

ఇదిలా ఉంటే .. పింఛన్ల పంపిణీపై గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ఫ్) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని పేర్కొంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయకూడదని స్పష్టం చేసింది. పింఛన్ లబ్దిదారులు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సెర్ప్ సూచించింది. అయితే గ్రామ, వార్డు సచివాలయాలకు రాలేని పరిస్థితిలో ఉన్న లబ్దిదారులకు మాత్రం ఉద్యోగుల ద్వారానే వారి ఇళ్ల వద్ద పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 3వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ లను పంపిణీ చేయనున్నారు.

చంద్రబాబు కుట్రతోనే వాలంటీర్ల సేవలను వినియోగించుకోలేకపోతున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. వాలంటీర్ల వల్లే నేరుగా ఇంటి వద్దకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్లపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీ నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు తరపున పని చేస్తుందని ఆరోపించారు. వృద్ధులు, వికలాంగ లబ్దిదారులను ఇబ్బంది పెడితే చంద్రబాబుకు ఏమి వస్తుందని సజ్జల ప్రశ్నించారు.

TDP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి మరో షాక్ .. మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?