NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 12 2024 Episode 443: లెటర్ చూసి ముకుందని అనుమానించిన ఆదర్శ.. కృష్ణ ఆనందం కోసం భవాని ప్లాన్..

Krishna Mukunda Murari Today Episode April 12 2024 Episode 443 highlights

Krishna Mukunda Murari April 12 2024 Episode 443: ముకుంద మీరాగా మరి భవాని దేవి ఇంట్లో సెటిల్ అవుతుంది మరోవైపు శ్రీనివాస్ తన ఇల్లు అమ్మేసేసి వేరే చోట ఉండడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు ఆ క్రమంలోనే ఈరోజు శ్రీనివాస్ కి మంచి బేరం కుదిరి ఇల్లు అమ్మేస్తాడు. సేటు డబ్బులు మొత్తం తీసుకువచ్చి శ్రీనివాస్ చేతిలో పెట్టి ఇకమీదట ఈ ఇల్లు మీది అని శ్రీనివాస్ చెప్తాడు దాంతో సేటు అసలు మీరు మీ అమ్మాయి జ్ఞాపకార్థం ఇల్లు ఉంచుకోవాలి కదా అలాంటిది మీ అమ్మాయి చనిపోతే మీరు ఇల్లు మాకెందుకు అమ్ముతున్నారు అని అడుగుతాడు. తనతో ఉన్న జ్ఞాపకాలు తలుచుకొని నేను ఎక్కువ బాధ పడుతున్నాను అందుకే ఇల్లు అమ్మేస్తున్నానని శ్రీనివాస్ కవర్ చేస్తాడు. కానీ సేటు ప్రతిసారి మీ అమ్మాయి చనిపోయింది అన్నమాట ఎక్కువసార్లు వాడడం వల్ల శ్రీనివాస్ కోపంతో అసలు ఏంటి మీరు మీ ఉద్దేశం ఏంటి మా అమ్మాయి చనిపోయిందని ఎందుకు అన్ని సార్లు అంటారు అని కోప్పడతాడు దాంతో సేటు ఉన్న మాటంటే మీకు అంత కోపం ఎందుకు వస్తుందండి మీ అమ్మాయి నిజంగానే చనిపోయింది ఆ విషయం మీరు జీర్ణించుకోవాలి. అంతేకానీ ఇలా కోప్పడితే ఎలాగో అని అంటాడు దానికి శ్రీనివాస్ సరేనండి మీ ఇల్లు అమ్మేశాము ఇది మీ ఇల్లు మీ ఇష్టం మీరెప్పుడు పాలు పొంగించుకుంటారు అని అడుగుతాడు. మీ అమ్మాయి చనిపోయింది కాబట్టి మేము పాలు రెండు రోజులు ఆగి పూజ చేసుకున్నాక పంపిస్తాము అని అంటాడు మళ్ళీ శ్రీనివాస్ కి కోపం వస్తుంది కానీ అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తాడు.

Krishna Mukunda Murari Today Episode April 12 2024 Episode 443 highlights
Krishna Mukunda Murari Today Episode April 12 2024 Episode 443 highlights

ఇక మరోవైపు ముకుందా కి శ్రీనివాస్ ఫోన్ చేస్తూ ఉంటాడు ముకుందా ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంది. ఇదేంటి నేను ఫోన్ చేస్తుంటే ముకుంద కట్ చేస్తుంది అని శ్రీనివాస్ మళ్ళీ ఫోన్ చేస్తాడు కానీ ముకుంద మళ్ళి కట్ చేస్తుంది ఇలా రెండు సార్లు జరిగిన తర్వాత ఎందుకు నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు నేను ఏ పరిస్థితిలో ఉన్నాను అర్థం చేసుకోవాలి కానీ అని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ముకుందా, అమ్మ ముకుందా బాగున్నావా అని అడుగుతాడు ఈ మాట అడగడానికైనా ఫోన్ చేసింది అని అంటుంది. అది కాదమ్మా అని అంటాడు మరి ఏంటి నాన్న లేకపోతే నేను ఫోన్ కట్ చేస్తున్నానంటే ఇక్కడ నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను ఆలోచించాలి కదా నువ్వు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేయడం ఇక్కడ నేను అనాధం చెప్పి వచ్చాను. నాన్న నాన్న అని ఫోన్లో మాట్లాడితే నేను ఇక్కడ ఎవరో ఒకరికి దొరికిపోతాను మొన్ననే కృష్ణ నీతో ఫోన్ మాట్లాడడం కనిపెట్టి నన్ను అడిగింది నేనేదో ఇంటి ఓనర్ ని నేను నాన్న అని పిలుస్తానని కవర్ చేశాను ఇప్పుడు మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే నేను ఎలా ఇక్కడ మాట్లాడుతాను అని అంటుంది ముకుందా అది కాదమ్మా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెబుదామని కాల్ చేశాను అని అంటాడు అదేంటో చెప్పు నాన్న అని అంటుంది. నేను ఇల్లు అమ్మేశాను అమ్మా అని అంటాడు అమ్మేసావు కదా మంచి పని చేశావు అని ఫోన్ పెట్టేస్తుంది అమ్మ అది కాదు నేను ఇంకొక విషయం నీతో చెప్పాలి అని లోపే ముకుంద ఫోన్ పెట్టేస్తుంది దాంతో శ్రీనివాస్ ఇదేంటి నేను ఈ డబ్బులు ఎక్కడ దాచి పెట్టాలి అని అడుగుదాం అనుకుంటే ఈలో ఫోన్ పెట్టేసింది సరేలే తనే చేస్తుంది అని అనుకుంటాడు శ్రీనివాస్ ఇక ముకుంద ఎవరు చూడలేదు నేను నాన్నతో ఫోన్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 12 2024 Episode 443 highlights
Krishna Mukunda Murari Today Episode April 12 2024 Episode 443 highlights

ఇక మరోవైపు కృష్ణ చాలా కోపంగా సీరియస్గా వెతుకుతూ ఉంటుంది అప్పుడే మురారి రూమ్ లోకి వస్తాడు. ఏంటి కృష్ణ అంత సీరియస్గా వెతుకుతున్నావు అని అంటే నాకు చిరాగ్గా ఉంది సార్ నన్ను కదిలించొద్దు అని అంటుంది. చిరాగ్గా ఉందా అని కృష్ణని నవ్వించడానికి చెక్కలిగింతలు పెడతాడు ఎసిపి సార్ మీరు ఇలా చేయొద్దు నాకు ఇంకా కోపం వస్తుంది అని అంటుంది. అవునా? ఎంత కోపం వస్తుందో చూస్తాను కదా అని, గిల్లికజ్జాలు పెడుతూ ఉంటాడు అప్పుడే ముకుంద అటుగా వెళుతూ కృష్ణా మురారి లను చూస్తుంది వెంటనే ముకుంద కోపం వస్తుంది నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇవాళ కృష్ణ కోపంగా ఉంటే చూసి తట్టుకోలేక చక్లిగింతలు పెడుతున్నావా మురారి అని మనసులో అనుకుంటూ, వాళ్ళిద్దరిని చూస్తూ కిటికీ దగ్గరే నిలబడి ఉంటుంది ఇక మురారి కృష్ణతో కోపం పోయేదాకా ఇలానే చేస్తాను అని అంటూ ఉంటాడు. కృష్ణ నవ్వుతూ వద్దు ఎసిపి సార్ అని అంటూ ఉంటుంది అనుకోకుండా అప్పుడే ఫైల్స్ అన్ని కింద పడిపోతాయి. ఆ ఫైల్స్ అన్ని టీ కృష్ణ అని అంటాడు నేను ఎందుకు తీస్తాను మీరు నన్ను నవ్వించడం వల్లే ఆ ఫైల్స్ కింద పడ్డాయి కాబట్టి మీరే తీయండి అని,నాకు కోపం వస్తుంది అని అంటుంది. దాంతో మళ్లీ మురారి కృష్ణకి మళ్లీ నవ్వించాలని చూస్తూ ఇక అక్కడి నుంచి బయటికి వెళ్తాడు ఇక దాంతో ముకుంద పక్కకి వెళ్తుంది మళ్లీ మురారి వెళ్లిపోయాడా లేదా అని చూడ్డానికి వస్తుంది. అప్పటికి మురారి రూమ్ లో ఉండడు కృష్ణ కింద పడిన ఫైల్స్ అన్ని పైన పెడుతూ అందులో ఒక లెటర్ చూసి సిగ్గుపడుతుంది ఆ లెటర్ భవానీ దేవి కృష్ణ కి రాస్తుంది..

Krishna Mukunda Murari Today Episode April 12 2024 Episode 443 highlights
Krishna Mukunda Murari Today Episode April 12 2024 Episode 443 highlights

భవాని దేవి రాసిన లెటర్ నీ కృష్ణ చదువుతుంది తింగరి నీలో కూడా ఒక అమ్మ ఉంది ఆ అమ్మని నువ్వు బయటికి తీసుకురావాలి నువ్వు కూడా అమ్మగా మారాలి ఇదే నా కోరిక అని రాసి ఉంటుంది మీ కోరిక నెరవేరుస్తాను పెద్ద అత్తయ్య అని అనుకుంటుంది కృష్ణ. మీకు మనమన్నా మనవరాలు నా తొందరలోనే ఇస్తాను అని అనుకొని ఈ విషయం అత్తయ్యకి చెప్పాలి అత్తయ్యని శోభనానికి ముహూర్తం పెట్టమని అడగాలి అని కిందకి వెళ్తుంది. అప్పుడే రేవతి కృష్ణ అని పిలుస్తుంది ఇక లెటర్ ని బెడ్ మీద పెట్టేసి వెళ్ళిపోతుంది కృష్ణ ఆ లెటర్ గాలికి ముకుంద కాళ్ళ దగ్గరికి వస్తుంది ముకుందా లెటర్ చదివి కోపంతో రగిలిపోతుంది. ఆవేశంగా లెటర్ తీసుకొని రూమ్ లోకి వెళుతుంది. మరోవైపు కిందకి వచ్చిన కృష్ణతో రేవతి ఈరోజు నాకు వంట చేయాలని లేదు బయట నుంచి ఆర్డర్ పెట్టుకుందామా అని అంటుంది. ఎందుకు అత్తయ్య నేను చేస్తానులే అని అంటుంది. ఇక దాంతో సరే అంటుంది రేవతి అత్తయ్య నేను మిమ్మల్ని ఒకటి అడగాలి మీరు ఒక విషయం మర్చిపోతున్నారు అని అంటుంది. ఏంటో చెప్పు అని అంటుంది మీరే కనిపెట్టండి నేను చెప్పలేను అని అంటుంది దాంతో కృష్ణ సిగ్గు పడుతుంటే ఓ నాకు అర్థమైంది అని అంటుంది ఏంటో చెప్పండి అత్తయ్య అని అంటుంది నువ్వు హాస్పిటల్ కి వెళ్ళాలి అనుకుంటున్నావు కదా సరే వెళ్ళు అని అంటుంది హాస్పిటల్ కి వెళ్ళడానికి ఇంత సిగ్గుపడడం ఎందుకు అత్తయ్య ఇది కాదు ఇంకోటి ఉంది మీరు బుర్ర పెట్టి ఆలోచించండి అని అంటుంది. నాకేం గుర్తు రావట్లేదు అని రేవతి అంటే అదే అత్తయ్య మీకు మనవడు మనవరాలు ఎత్తుకోవాలని ఉంది కదా ఆ విషయం గురించి అని అంటుంది దాంతో అప్పుడు అర్థమవుతుంది రేవతికి నా మట్టి బుర్రకి ఇప్పటిదాకా కట్టలేదే నేను ఇప్పుడు అక్కకి చెప్పి శోభనానికి ముహూర్తం పెట్టమని చెప్తాను అని అంటుంది. ఇక సిగ్గుపడితే వెళ్ళిపోతుంది కృష్ణ.

Krishna Mukunda Murari Today Episode April 12 2024 Episode 443 highlights
Krishna Mukunda Murari Today Episode April 12 2024 Episode 443 highlights

ఇక మరోవైపు లెటర్ తీసుకొని కోపంగా ఆవేశంగా లోపలికి వెళ్లిన ముకుందా ఆ లెటర్ చదువుతూ కృష్ణ నువ్వు తల్లివి అవుతావా ఎలా అవుతావో నేను చూస్తాను నువ్వు తల్లి అవుతావు అంటే తండ్రి మురారి ఏ కదా అది మాత్రం ఎప్పటికీ జరగనివ్వను కాపురంలో నిప్పులు పోస్తాను అని అ లెటర్ ని చింపి ఆవేశంగా ముక్కలు చేసి పైకి విసిరేస్తుంది అదంతా ఆదర్శ్ చూస్తాడు. ఆదర్శం లోకి వచ్చి ఏంటి ముకుందా నువ్వు చింపేసిన లెటర్ అని అడుగుతాడు దానికి ముందుకు ఏం చెప్పాలో తెలియదు నిజం చెప్పలేదు అలాగని అబద్ధం చెప్పినా అక్కడ లెటర్ కనిపిస్తుంది ఏం చెప్పాలో తెలియక ఆ లెటర్ ముకుంద రాసింది అని చెప్తుంది. ముకుంద రాజు లెటర్ అయితే దాచిపెట్టుకోవాలి కానీ అలా కోపంగా ఆవేశంగా చింపేశావ్ ఏంటి అని అంటే, ఏమి చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది అప్పుడే ఆదర్శ్ కాల దగ్గర ఉన్న లెటర్ పీస్ ని తీసుకొని చూస్తాడు అందులో కృష్ణ అని రాసి ఉంటుంది. నిజం చెప్పు ముకుందా ఈ లెటర్ ఎవరు రాసింది కృష్ణ అని రాసింది అంటే ఈ లెటర్ కృష్ణకు సంబంధించిందా అసలు ఏమైందో చెప్పు నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు బలవంతం లేదు అంటాడు మీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు దాచి పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. ముకుంద నాకు ఫ్రెండ్ గా రాసిన లెటర్ అది అందులో కృష్ణ తనని ఎంత ఇబ్బంది పెట్టిందో రాసింది ఆ ఇబ్బంది తట్టుకోలేక తన నరకం చూసింది ఆ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకుంది ఇది చాలా దారుణం ఆదర్శ గారు అని ఏడుస్తూ అక్కడి నుంచి నాటకాలు ఆడుతూ వెళ్ళిపోతుంది. ఆదర్శ కోపంగా కృష్ణని తలుచుకొని ముకుంద చెప్పిన మాటలన్నీ విని కృష్ణ మీద ఇంకా పగపించుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 12 2024 Episode 443 highlights
Krishna Mukunda Murari Today Episode April 12 2024 Episode 443 highlights

ఇక మరోవైపు రేవతి అందరూ కూర్చొని ఉంటే అక్కడికి వెళ్లి అక్క నీతో ఒక మాట మాట్లాడాలి అని అంటుంది. మళ్ళీ ఏమైంది రేవతి అని అంటుంది ఇది సంతోషించాల్సిన విషయం అక్క అని అంటుంది. అవునా అయితే ఏంటో చెప్పు అని అంటే కృష్ణ మురారిలకి శోభనానికి ముహూర్తం పెట్టమనుకుంటున్నాను అక్క అని అంటుంది వెంటనే పక్కనే ఉన్న సుమలత మంచి పని చేస్తున్నావ్ అక్క ఇన్నాళ్లు ఆ తింగరిది అందరికోసం ఆలోచించి తనకంటూ ఏ సంతోషం లేకుండా ఉండిపోయింది ఇప్పటికైనా తనకి ఒక సంతోషాన్ని ఇచ్చే వార్తను మనం చెప్తే బాగుంటుంది అని అంటుంది నువ్వేమంటావ్ అక్క అని అడుగుతుంది రేవతి భవానిని భవాని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అక్క ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది రేవతి లేదు వాళ్ళిద్దరిని పిలువు అని అంటే కృష్ణ ఇక్కడే ఉంది అక్క వంట గదిలో అని కృష్ణ అని కేకేస్తుంది రేవతి వస్తున్న అన్నయ్య తిరగమాత వేస్తున్నాను అంటుంది నీ మొఖం తిరగమాత ఇట్రా అని అంటుంది రేవతి ఆ మాట కృష్ణ కోపం వచ్చి భవానీ దేవి ఉన్న విషయం చూసుకోకుండా రేవతి మీద అరుస్తూ వస్తుంది ఏమనుకుంటున్నారు ప్రతిసారి నా ముఖం నా ముఖం అంటారేంటి మీ అబ్బాయి కూడా అలానే అంటాడు అని అగబడుతుంది. అందులో భవాని ఇది చూసి సారీ అత్తయ్య నేను మిమ్మల్ని గమనించలేదు అని అంటుంది. ఇక అక్కడికి ఆదర్శం ముకుందా కూడా వస్తారు. చాలా కోపంగా ఉంటారు ఇద్దరు కృష్ణ వైపు చూస్తూ మరోవైపు మురారిని కూడా మధు తీసుకువస్తాడు. భవాని దేవి మాటల్లో నీకు చుడిదార్ సే బాగుంటాయి అని అంటుంది కృష్ణ నాకు చుడిదార్స్ భాగోవని ఏసీబీ సార్ పొద్దున్నే చెప్పారు అత్తయ్య అని అంటుంది అదేంటి మురారి కృష్ణ కి చుడిదార్ చాలా బాగుంటాయి అని అంటుంది భవాని. ఎవరు చెప్పినా కానీ నేను మాత్రం కళ్ళు మూసుకొని కూడా చెప్తాను నీకు మాత్రం సుడిదార్స్ బాగోదు అని అంటాడు. దాంతో ఇద్దరు గిల్లికజ్జాలు ఆడుకుంటూ ఉంటారు అదంతా చూసి ముకుంద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో, కృష్ణ మురారి ఇద్దరినీ భవానీ దేవి మీరు ఇప్పటిదాకా ఎలా ఉన్నారు నాకు తెలీదు. ఇప్పటికైనా తింగరి మీ అత్తయ్య చేతిలో ఒక మనమన్న మనవరాలునో పెట్టు అని అంటుంది దానికి కృష్ణ సిగ్గుపడుతుంది అక్కడే ఉన్న ముకుంద షాక్ అవుతుంది. అయితే పంతులు గారిని ఫోన్ చేస్తాను అక్క ముహూర్తం పెట్టడానికి అని అంటుంది రేవతి ఏం అవసరం లేదు రేవతి ఇక ముహూర్తాలు పెట్టడానికి ఏమీ వద్దు మన ముహూర్తం పెట్టినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది అందుకే భార్యాభర్తలుగా వీళ్ళు ఎప్పుడో ఒకటయ్యారు ఇంకా అలాంటప్పుడు ఇద్దరూ కలిసి ఉండడానికి ముహూర్తాలు ఎందుకు ఇద్దరూ ఎప్పుడైనా ఒకటవచ్చు అని అంటుంది విత్ దాంతో కృష్ణ సిగ్గుపడుతుంది. ముకుంద మాత్రం షాక్ లో చూస్తూ ఉండిపోతుంది.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N