NewsOrbit
రాజ‌కీయాలు

‘పార్టీ మైలేజీపైనే యావ!’

అమరావతి: ప్రతి విషయంలోనూ రాజకీయ మైలేజ్ పొందడం పైనే చంద్రబాబు ఆలోచనలు పరిభ్రమిస్తాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ధర్మపోరాట దీక్ష అయినా, హరికృష్ణ పార్ధివ దేహం సాక్షిగా టిఆర్ఎస్‌తో పొత్తు ప్రస్తావన అయినా, కోడెల అంతిమయాత్ర అయినా చంద్రబాబు ఆరాటం ఒకేలా ఉంటుందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రతి సందర్భాన్నీ తన పార్టీ కార్యక్రమంలాగానే చంద్రబాబు భావిస్తారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

రివర్స్ టెండర్‌లో 58కోట్ల రూపాయలు ఆదా అయితే ప్రజాధనాన్నిలూటీ చేసిన చంద్రబాబు అంతకంటే భిన్నంగా ఎలా స్పందిస్తారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తానంటే తీగలపై బట్టలారేసుకోవాల్సిందేనని అన్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీని ప్రవేశపెడితే ప్రైవేటు హాస్పటళ్ల కోసమే అని శోకాలు పెట్టారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

ప్రజాసమస్యలపై గళం విప్పాల్సిన చంద్రబాబు తన బంధువులు, బినామీలు నష్టపోతున్నారనే ఆందోళనతో అమరావతి, పోలవరం, కృష్ణపట్నం, బందరు పోర్టుల గురించి వాపోతున్నారని విజయసాయి వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్‌ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.

ఇంటికో ఉద్యోగమిస్తానని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి  గెల్చిన చంద్రబాబు నిరుద్యోగులకు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి లక్షా 30వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే పేపరు లీకయిందని కిరసనాయిలుతో కలిసి డ్రామాలాడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రశ్నాపత్రం ఎలా రూపొందిస్తారో తెలుసుకొని ఎడవొచ్చుగా అని విజయసాయి వ్యంగంగా విమర్శించారు.

Related posts

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

Leave a Comment