NewsOrbit
రాజ‌కీయాలు

జగన్ నిర్ణయానికి జై…కానీ!

విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ ప్రటకనపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకిస్తుంటే.. ఆపార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని గంటా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదిక గతంలో కూడా చెప్పానని గుర్తు చేశారు. విశాఖ ప్రాంతానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అయితే విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడంతో పాటుగా, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఏం చేస్తుందో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానిలో భూములు ఇచ్చిన రైతులు ఆందోళనకు, తమ పార్టీ అధినేత నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని గంటా స్పష్టం చేశారు.

ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్‌, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలు జ్యుడిషియరీ కేపిటల్ ఉండొచ్చన్నారు. అయితే సీఎం జగన్ ప్రకటనకు అనుగుణంగా జీఎన్ రావు కమిటీ కూడా రిపోర్టు ఇచ్చింది. దీనిపై ఈ నెల 27న క్యాబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకోకున్నారు.

 

Related posts

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Leave a Comment