NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కేంద్రం కంటే ఏపి ఆర్ధిక పరిస్థితి బాగుంటే అప్పుల కోసం ఎందుకు పరిగెడుతున్నారంటూ సోము వీర్రాజు సెటైర్

కేంద్రం కంటే ఏపి ఆర్ధిక పరిస్థితే బెటర్ గా ఉందంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. నిన్న ఢిల్లీలో వైసీపీ ఎంపీల మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్  నేతృత్వంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని అన్నారు. ఈ సందర్భంలో కేంద్రంపైనా విమర్శించారు విజయసాయిరెడ్డి. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. రాజధాని పరిధిలోని ఉండవల్లి నుండి గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ మనం మన అమరావతి పేరుతో పాదయాత్ర చేపట్టగా, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోము వీర్రాజు హజరై మాట్లాడారు. కేంద్ర కంటే పరిస్థితి బాగుంటే .. కేంద్రం ఇచ్చిన బియ్యం ఎందుకు పంపిణీ చేయలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. అంతా బాగుంటే రోజు అప్పుల కోసం ఎందుకు పరుగెడుతున్నారన్నారు. ఆర్ధిక పరిస్థితి బాగున్నప్పుడు రాజధాని ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు సోము వీర్రాజు.

AP BJP: New Politics - News Poliitcs..!

 

ఏపి ప్రజలకు రాజధాని లేకుండా చేశారని సోము వీర్రాజు విమర్శించారు. దీనికి వైసీపీతో పాటు టీడీపీ కూడా కారణమేనని ఆరోపించారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా మోసం చేయలేదని అన్నారు సోము వీర్రాజు. అమరావతిలో నిర్మాణాలను వెంటనే ప్రారంభించలనీ, రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు.  రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల్లో ఏమేం చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బైపాస్ రోడ్డు, ఫ్లైఓవర్లు నిర్మించడం జరిగిందన్నారు. రాజధానిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలకు కూడా కేంద్రమే నిధులు ఇస్తోందన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల భూసేకరణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ సీఎం జగన్ చేసిన విమర్శలకు సోము వీర్రాజు స్పందిస్తూ పోలవరం ఆర్ అండ్ ఆర్ నివేదికను ఇంత వరకూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. జగన్ చెబుతున్నట్లు డబ్బులు ముద్రించే ప్రింటింగ్ మిషన్ కేంద్రం వద్ద ఉండదని అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!