AP Nominated Posts: బిగ్ బ్రేకింగ్..టీటీడీ చైర్మన్ గిరీ మళ్లీ వైవీ సుబ్బారెడ్డికే..!?..నామినెేటెడ్ పోస్టుల్లో మహిళా నేతలకు పెద్దపీట..!!

Share

AP Nominated Posts: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి మళ్లీ వైవీ సుబ్బారెడ్డినే జగన్ సర్కార్ నియమించనున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో సీఎం వైఎస్ జగన్ కొత్త విధానానికి తెరితీసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో జోడు పదవుల పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన అదనపు పదవులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. కాపు కార్పోరేషన్, బ్రాహ్మణ కార్పోరేషన్ వంటి పదవులు ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఉండగా వారి నుండి తొలగించి కొత్త నేతలకు ఆ పదవులు ఇచ్చినట్లు చెబుతున్నారు.

AP Nominated Posts announced minister sucharita
AP Nominated Posts announced minister sucharita

Read More: Supreme Court: ఇకపై బెయిల్ మంజూరైన క్షణాల్లోనే రిలీజ్..! జస్టిస్ ఎన్‌వీ రమణ ‘ఫాస్టర్’..!!

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణు లు నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం నెడ్ క్యాప్ చైర్మన్ గా కేకే రాజు, ఏపిఐఐసీ చైర్మన్ గా మెట్టు గోవర్థన్ రెడ్డి, కాపు కార్పోరేషన్ చైర్మన్ గా అడపా శేషు, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ గా బొప్పన భవకుమార్, రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా మొండితోక అరుణ్ కుమార్, కమ్మ కార్పోరేషన్ చైర్మన్ గా పెనమలూరు నియోజకవర్గం నుండి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), రాష్ట్ర విద్యా విభాగం చైర్మన్న గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, ఏపి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా సుధాకర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్ గా జాన్ వెస్లీ, రాష్ట్ర గ్రంధాలయ కార్పోరేషన్ చైర్మన్ గా దాడి రత్నాకర్, ఏపి  ఎండీసీ చైర్మన్ గా మదనపల్లికి చెందిన అస్లాం, స్మార్ట్ సిటీ కార్పోరేషన్ చైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జీవి తదితరులను ప్రభుత్వం నియమించినట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేశారు. ఆర్ టీసీ చైర్మన్ పదవి కూడా మహిళకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ టీసీ చైర్మన్ పదవి ఎంవి రమణారెడ్డి కుటుంబం నుండి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా మొత్తం 135 మంది నామినేటెడ్ పోస్టుల్లో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు కేటాయించారు. 68 పోస్టులు మహిళలకు, 67 పోస్టులు పురుషులకు కేటాయించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,  రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.


Share

Related posts

Traffic Police : ఈ సీతయ్య ఎవరి మాట వినడు…!!

somaraju sharma

AP Bjp: కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపి బీజేపీ..!అవి ఏమిటంటే..!?

somaraju sharma

దూసుకెళ్తున్న హీరో మోటో కార్ప్ బైక్స్..

bharani jella