NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ వర్సెస్ తెలంగాణ ..మంత్రుల మధ్య మాటల యుద్దం ..మంత్రి బొత్సకు తెలంగాణ మంత్రుల సవాల్

ఏపీ – తెలంగాణ మంత్రుల మధ్య మళ్లీ మాటల యుద్దం స్టార్ట్ అయ్యింది. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ పై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. తెలంగాణ విద్యా వ్యవస్థ, విద్యార్ధులను ఏపి మంత్రి బొత్స అకారణంగా అవమానించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో చూసి పరీక్షలు రాస్తున్నారని చేస్తున్న బొత్స వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చకు నన్ను రమ్మంటారా..? మీరు వస్తారా? అని సవాల్ విసిరారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి .. పోనీ హైదరాబాద్ .. ఎక్కడైనా సరే చర్చకు తాను సిద్దమని ప్రకటించారు. మీ విద్యార్ధులు మా విద్యార్ధులతో పోటీ పడితే అసలు విషయం బయటపడుతుందని అన్నారు.

AP Minister Botsa satyanarayana

 

ఏపి నుండి చదువు కోవడానికి తెలంగాణకు వస్తున్నారే తప్ప.. తెలంగాణ వాళ్లు ఏపీకి పోవడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అందరినీ సమానంగా చూసి ఉంటే రెండు రాష్ట్రాలు కలిసి మెలసి ఉండేవనీ, మీ లాంటి వ్యక్తుల వ్యాఖ్యలతోనే తెలంగాణ విడిపోయిందని ఆరోపించారు. తిరుమల శ్రీవారి దర్శనం కావాలంటే రకరకాల ఇబ్బందులని కానీ అదే మా దగ్గర యాదాద్రి, వేములవాడ, రామప్ప, భద్రకాళి ఎక్కడైనా సరే అందరికీ ఒకే రకంగ చూస్తామన్నారు. తమ పార్టీ బీఆర్ఎస్ కు ఏపీ నుండి కూడా ఆదరణ ఉందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ ఏపి మంత్రి బొత్స సత్యనారాయణవి అవగాహన లేని వ్యాఖ్యలన్నారు. అవి తెలంగాణను కించపరిచేలా ఉన్నాయని మండిపడిన ఆమె.. బొత్స ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ విద్యా వ్యవస్థను వేలెత్తి చూపేంత స్థాయి మీకు లేదని అన్నారు. రెండు రాష్ట్రాల విద్యా వ్యవస్థ పై చర్చించేందుకు మంత్రి బొత్స సిద్దమా అంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. అంతకు ముందు ఏపిపై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య కొద్ది రోజులు మాటల యుద్దం జరిగింది. మరల ఏపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో మళ్లీ దుమారం రేగింది.

నిన్న ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముందు మాట్లాడుతూ సర్వీస్ కమిషన్ పరీక్షలే సరిగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించలేకపోయిందని విమర్శించారు. తెలంగాణలో ఆగిపోయిన ఉపాధ్యాయుల బదిలీలపైనా కామెంట్స్ చేశారు. ఉపాధ్యాయులు బదిలీలు కూడా తెలంగాణ వాళ్లు చేసుకోలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో వ్యవహారాలు రోజు పేపర్ లో చూస్తున్నామనీ, వారితో ఎలాంటి పోలిక వద్దంటూ అభిప్రాయపడ్డారు మంత్రి బొత్స. వాస్తవానికి ఇక్కడ నారద పాత్రను మీడియా పోషించింది. తెలంగాణలో జరుగుతున్న ఇంజనీరింగ్ ప్రవేశాలపై మీడియా ఆయనను ప్రశ్నించడంతో బొత్స అన్యోపదేశంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రాన్ని కంపేర్ చేయొద్దని మీడియాకు సూచించిన మంత్రి బొత్స..ఎవరి విధానం వారికి ఉంటుందన్నారు. ఎవరి ఆలోచన వారిదన్నారు. ఎవరి లేన్ వాళ్లదనీ, ఎవరిపైనా కామెంట్స్ చేయడం లేదంటూనే సీరియస్ కామెంట్స్ చేశారు.  ఏపిలో అమలు చేస్తున్న విద్యా విధానం దేశంలో చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు బొత్స. ఏపి గురించి గొప్పగా చెబుతూ తెలంగాణపై కామెంట్స్ చేయడంతో అక్కడి మంత్రులు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ మంత్రుల సవాల్ పై మంత్రి బొత్స ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

‘పంచకర్ల’ పయనమెటు ..? ఆప్షన్ ఆ ఒక్క పార్టీయే(కదా)..!

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N