Breaking: చిత్తూరు జిల్లా మెరానపల్లె అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో కార్మికులు ఆందోళనతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.