YS Viveka Case: సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కరరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టు అయిన ఆయన సోదరుడు వైఎస్ భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. సీబీఐ, సునీత వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కేసులో మెరిట్స్ అధారంగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉండటంతో బెయిల్ మంజూరు చేయలేమని భాస్కరరెడ్డి న్యాయవాదికి న్యాయస్థానం స్పష్టం చేసింది. వివేకా హత్య కు జరిగిన కుట్రలో భాస్కరరెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. భాస్కరరెడ్డికి బెయిల్ మంజూరూ చేస్తే జరిగే పరిణామాలను కోర్టుకు సీబీఐ తరపు న్యాయవాది వివరించారు.

అయితే ఇదే కేసులో భాస్కరరెడ్డి తనయుడు వైఎస్ అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో సీబీఐ కోర్టు భాస్కరరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తుందని భావించారు. భాస్కరరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నిన్నటి వరకూ ఇరువైపు వాదనలు విన్న సీబీఐ కోర్టు బెయిల్ కు నో చెప్పింది. భాస్కరరెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సీబీఐ ఆయనను ఏప్రిల్ 16వ తేదీన అరెస్టు చేసింది. భాస్కరరెడ్డి అరెస్టునకు ముందు రెండు రోజుల ముందు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసారు. వివేకా హత్యకు ముందు రోజు భాస్కరరెడ్డి ఇంట్లో ఉదయ్ కుమార్ ఉన్నట్లుగా గూగుల్ టేకౌట్ ద్వారా సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలో భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది.
YS Viveka Case: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ