NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandra babu : కుప్పం విష‌యంలో చంద్ర‌బాబు చేతులు ఎత్తేశారా?

AP Political News: Gassip Internal Facts

Chandra babu : చంద్ర‌బాబు నాయుడు టీడీపీ అధినేత. చిత్తూరు జిల్లా కుప్పం.. చంద్రబాబునాయుడి నియోజకవర్గం. 1989 నుంచి అక్కడ ఆయనకు తిరుగులేదు. అలాంటి నియోజకవర్గంలో ఉన్న పంచాయతీలపై అధికార‌ వైసీపీ కన్నేసింది. ఈసారి ఆ కంచుకోటను బద్దలుకొట్టేందుకు అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో మూడో విడత పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.

Chandra babu :
Chandra babu

నేడే చూడండి!

టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పంలో కూడా మూడ విడ‌త‌లో ఎన్నికలు జరగనున్నాయి. గత ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనే గెలుస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ కాస్త తగ్గినా.. ఇక్కడ పసుపు జెండా ఎగరడం మాత్రం ఆగలేదు. ఇప్పుడు ఆ కోటను బద్దలు కొట్టాలనే వ్యూహంతో పనిచేస్తోంది అధికార వైసీపీ. గత ఎన్నికల్లో కుప్పం ఫలితాల మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు నాయుడు కాస్త వెనుకబడ్డారు. ఈ విషయం వైసీపీ నేతల మైండ్లో బాగా ఫిక్స్ అయింది. గట్టిగా ప్రయత్నిస్తే బాబు గారిని దెబ్బ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని ఇప్పటికీ వైసిపి నేతలు బలంగా నమ్ముతున్నారట. సొంతగడ్డపై చంద్రబాబుకు షాక్‌ ఇస్తే.. ఆ ప్రభావం ఏపీ రాజకీయాలపై బాగా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఎస్‌ఈసీకి చంద్రబాబు సంచ‌ల‌న లేఖ రాశారు.

 కుప్పంలో అలా జ‌రుగుతోందా?

తన నియోజనర్గంలోఅసాంఘిక శక్తులు చొరబడ్డాయని ఎస్‌ఈసీకి చంద్రబాబు సంచ‌ల‌న లేఖ రాశారు. ఎన్నడూ లేని విధంగా కుప్పంలోని పంచాయతీల్లో అలజడి రేకెత్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని లేఖలో తెలిపారు. కొన్ని పంచాయతీల్లో భద్రత పటిష్టం చేయాలని… మరికొన్ని మండలాల్లో ప్రత్యేక భద్రత, ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలని లేఖ ద్వారా ఎస్ఈసీని చంద్రబాబు కోరారు.

Chandra babu : చంద్ర‌బాబు భ‌యం అదేనా?

కుప్పంలో టీడీపీకి మంచి మెజారిటీ కట్టబెట్టేది గుడిపల్లె మండలం. ఇక్కడ నుంచే వైసీపీలోకి వలసలు మొదలెట్టారు. టీడీపీ తో 30 ఏళ్ల అనుబంధం ఉన్న కుప్పం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్.. ఇటీవలే వైసిపిలో చేరారు. ఇది టిడిపికి పెద్ద కుదుపు. జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ శ్యామ రాజు సైతం టిడిపిని వీడారు. కుప్పం నియోజకవర్గంలో బీసీల జనాభా ఎక్కువ. వన్నె కుల క్షత్రియ, కురబ కులస్తులు గణనీయంగా ఉన్నారు. వీరిపై వైసిపి దృష్టి సారించింది. ఇలా చ‌క్ర‌బంధం అయిపోయిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు టెన్ష‌న్ ప‌డుతున్నార‌ని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.
author avatar
sridhar

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju