21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Janasena BJP: బుర్ర లేనిది ఎవరికో.. పజిల్ మాటలు ఎందుకో..? ఎవరి వాగుడు వాళ్లదే..

Share

Janasena BJP: ఏపిలో జనసేన – బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు పొత్తుల పజిల్ గా మారిపోయింది. ఈ పజిల్ ను ఎవరు సాల్వ్ చేయాలి..? జనసేన కార్యకర్తలు సాల్వ్ చేయాలా.. ? ఏపి ప్రజలు సాల్వ్ చేసుకోవాలా..? రాజకీయ అభిమానులు సాల్వ్ చేసుకోవాలా..? ఇంతకూ ఆ పజిల్ ఏమిటంటే..! సోము వీర్రాజు, జీవీఎల్ నర్శింహారావులు జనసేన – టీడీపీ మాత్రమే పొత్తు ఉంటుంది. టీడీపీ ఈ రాష్ట్రంలో చచ్చిపోయింది. టీడీపీ భవిష్యత్తు అంధకారమే. వైసీపీకి మేమే (బీజేపీ) ప్రత్యామ్నాయం, వాళ్లను దించి మేమే గద్దె నెక్కుతాము అని పదేపదే చెబుతున్నారు. రీసెంట్ గా జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా వ్యూహరచన చేస్తున్నామని అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే మా లక్ష్యం అని అన్నారు. ఈ పార్టీల నేతల మాటలను బట్టి చూస్తే పజిల్ ఉన్నట్లా.. ?లేనట్లా.. ?. వైసీపీ వ్యతిరేక ఓటు ముందుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాతనే జనసేన, బీజేపీకి పడతాయి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా వ్యూహరచనతో ముందుకు వెళతాము ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి అనేది అర్ధం. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటాయి.

Janasena BJP

Janasena BJP: విరుద్దమైన మాటలు

నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు అలా ఉంటే.. బీజేపీ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్ నర్శింహరావులు టీడీపీతో కలిసే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. జనసేన – బీజేపీ మాత్రమే వైసీపీకి ప్రత్యామ్నాయం, టీడీపీకి భవిష్యత్తే లేదు. అవసరమైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నే సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తాం, జనసేన పార్టీ మాతోనే ఉంటుందని పదేపదే చెబుతున్నారు. ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారు. ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. ఎవరి ప్రెయారిటీలు వాళ్లు చూసుకుంటున్నారు. గత నెల వరకూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వము అని స్పష్టంగా చెప్పారు. కానీ నాదెండ్ల మనోహర్ రీసెంట్ గా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా వ్యూహంతో ముందుకు వెళతామన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వము అనడం వేరు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా వ్యూహంతో ముందుకు వెళతాము అంటే అర్ధం మారుతుంటే. అల్ రెడీ ఒక వ్యూహం ఉంటేనే చీలనివ్వము అని స్పష్టంగా చెప్పాలి.

Pawan Kalyan

పొత్తులో ఉన్నారన్న పేరే గానీ..

మిత్రపక్షాలు రెండు ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతుంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. బీజేపీ – జనసేన ముఖ్య నేతలు ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టి మేమే కలిసి పోటీ చేస్తాము, వేరే ఏ పార్టీత పొత్తులు ఉండవు అని చెప్పెస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కానీ కలిసి ఈ విషయాన్ని చెప్పరు. విడివిడిగా ఎవరి ఎజెండాతో వాళ్లు మాట్లాడుతుంటారు. పొత్తులో ఉన్నారన్న పేరే గానీ కలిసి నిర్వహించిన ఒక్క కార్యక్రమం ప్రెస్ మీట్ గానీ, ఆందోళనలు కానీ లేదు. కానీ కలిసి ఎన్నికలకు వెళతామని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. ఎవరి మాటలు వారు మాట్లాడుతుండటంతో బుర్ర లేనిది ఎవరికో.. పజిల్ మాటలు ఎందుకో..? ఆయా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అర్ధం కావడం లేదు.

BJP-Janasena to party ways?
bjp-janasena

Share

Related posts

Tollywood Heros: తెలుగు హీరోల్లో ఎవరు ఎంత చదివారో చూడండి..! మరీ దారుణం..!!

bharani jella

AP CM YS Jagan: జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్ష..అధికారులకు కీలక అదేశాలు..

somaraju sharma

అత్యాచారం కేసులో యువకుడికి పదేళ్ల జైలు

Mahesh