Srikakulam: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రీకాకుళం పర్యటనలో మాజీ కేంద్ర మంత్రి, వైసీపీ నాయకురాలు కిల్లి కృపారాణికి అవమానం జరిగింది. హెలిపాడ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన కృపారాణిని పోలీసులు అడ్డుకున్నారు. సీఎంకు ఆహ్వానం పలికే నాయకుల జాబితాలో ఆమె పేరు లేదని చెప్పడంతో కృపారాణి అవాక్కయ్యారు. ఈ జాబితా తయారు చేసింది ఎవరు. కృపారాణి ఎవరో అధికారులకు తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమె అక్కడ నుండి వెనుతిరిగారు.
కృపారాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ నుండి వెళ్లిపోతుండగా మంత్రి ధర్మాన ప్రసాదరావు వర్గీయులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు పొరబాటున జాబితాలో పేరు రాయలేదేమో వారితో మాట్లాడి జగన్ వద్ద కు తీసుకువెళతామని నేతలు ఆమెను సర్ది చెప్పాలని చూసినా కృపారాణి శాంతించలేదు. శ్రీకాకుళం నుండి కేంద్ర మంత్రిగా చేసిన కృపారాణి ఎవరో జిల్లా కలెక్టర్ కు తెలియదా, ఈ అవమానం తాను తట్టుకోలేను, ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లాలి అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం నందు సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అమ్మఒడి పథకం మూడవ విడత నిధులను విడుదల చేశారు.
మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…
నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…