NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSR Awards: ఏపీ సర్కార్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

Share

YSR Awards: ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రశంసల వర్షం కురిపించారు.  ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు ఇవేళ ఘనంగా జరిగియి. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్.. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లిఖార్జునరావు రచించిన స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు.

అనంతరం విజయవాడ ఏ – కన్వెన్షన్ సెంటర్ లో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆవార్డులు – 2023 ప్రధానోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ తో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొని వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ..దేశంలో మొట్టమొదటి సారిగా వార్డు, గ్రామ సచివాలయాలను స్థాపించిన ఘనత ఏపీకే దక్కిందని అన్నారు. పాలనను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేందుకు అవి ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. దేశంలోనే మొదటి సారిగా రైతుల భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

నవరత్నాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు సాయం అందుతోందని అన్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయిదు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పదవులు ఇచ్చి న్యాయం చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తొందన్నారు. నామినేటెడ్ పదవులు, పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. స్వచ్చ సర్వేక్షన్ లో ఏపీ 7వ స్థానంలో నిలిచిందన్నారు. అన్ని ప్రధాన రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని కితాబు ఇచ్చారు జస్టిస్ అబ్దుల్ నజీర్. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం జగన్.. మూడేళ్లుగా వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు అందించే సాంప్రదాయం కొనసాగుతోందన్నారు.

Telangana Assembly Election: బీజేపీకి బిగ్ ఝలక్ .. మాజీ ఎంపీ వివేక్ రాజీనామా, కాంగ్రెస్ లో చేరిక


Share

Related posts

ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. ఏటీఎం మోసాల‌ను అరిక‌ట్టేందుకు కొత్త స‌దుపాయం..

Srikanth A

బిగ్ బాస్ 4 : నోటి దురుసు తో ఈ వారం ఎలిమినేషన్ టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకున్న ఆ కంటెస్టెంట్?

arun kanna

ఎన్నికల నిర్వహణపై సిఎస్ సమీక్ష

sarath