NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly Election: బీజేపీకి బిగ్ ఝలక్ .. మాజీ ఎంపీ వివేక్ రాజీనామా, కాంగ్రెస్ లో చేరిక

Telangana Assembly Election: తెలంగాణ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ నందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్, ఆయన తనయుడు వంశీ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ .. బీఆర్ఎస్ ను గద్దే దింపే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని వివేక్ నమ్మారన్నారు. వివేక్ చేరికతో తమ పార్టీకి వెయ్యి ఏనుగుల బ లం వచ్చిందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. వివేక్ మాట్లాడుతూ .. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందని అన్నారు. కేసిఆర్ కుటుంబం వారి ఆకాంక్ష మేరకే పని చేస్తొందని ఆరోపించారు. కేసిఆర్ ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. టికెట్ అనేది అంత ముఖ్యమైన విషయం కాదని వివేక్ వ్యాఖ్యానించారు.

అయితే వివేక్ తనయుడు వంశీ కి చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారని సమాచారం. కుమారుడిని అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపి, పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి వివేక్ పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత వెంకట స్వామి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన వివేక్ 2009 లో పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. పార్లమెంట్ లో బొగ్గు మరియు ఉక్కు కమిటీల సభ్యుడిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 2013 లో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 మార్చి 31 న తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరరు.

2014 ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. ఆ తర్వాత 2016లో టీఆర్ఎస్ లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైయ్యారు. 2019  లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2019 ఆగస్టులో బీజేపీలో చేరారు. 2021 అక్టోబర్ లో బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైయ్యారు. ప్రస్తుతం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యుడుగానూ ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వివేక్ బీజేపీకి రాజీనామా చేసి మరో సారి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Telangana Assembly Polls: తెలంగాణలో ‘కారు’ గేరు మార్చేందుకు బీజేపీ వ్యూహం..?  కాంగ్రెస్ అప్రమత్తమైనట్లే(గా)..!  

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju