NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly Polls: తెలంగాణలో ‘కారు’ గేరు మార్చేందుకు బీజేపీ వ్యూహం..?  కాంగ్రెస్ అప్రమత్తమైనట్లే(గా)..!  

Share

Telangana Assembly Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ అభ్యర్ధులను ప్రకటిస్తూ  ముమ్మరంగా ప్రచారాన్ని చేస్తున్నాయి. వరుసగా మూడో సారి అధికారాన్ని దక్కించుకుని హాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంలో  బీఆర్ఎస్ ముందుగానే వంద మందికిపైగా అభ్యర్ధులను ప్రకటించి కదనరంగంలోకి దూకేసింది. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్ధులను ప్రకటిస్తూ ప్రచార పర్వంలో నిమగ్నమైయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్ధుల విజయానికి ఆ పార్టీ  అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, బీజేపీ నుండి ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా తదితర జాతీయ స్థాయి నాయకులు ప్రచార పర్వంలో పాలుపంచుకుంటున్నారు. 30కిపైగా స్థానాల్లో పోటీ చేయాలని భావించిన జనసేన – బీజేపీ పొత్తులో భాగంగా 20 స్థానాలను కేటాయించాలని కోరుతోంది. బీజేపీ అధిష్టానం చివరకు ఎన్ని స్థానాలు కేటాయిస్తే అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి జనసేన సమాయత్తమవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో వచ్చిన గెలుపు ఉత్సహాంతో ఈ సారి ఎలాగైనా  తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లురుతోంది.

బీజేపీ మాత్రం ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని, హాంగ్ వస్తే కింగ్ మేకర్ అవ్వాలని చూస్తుందని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల ముందు వరకూ రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ల మద్య త్రిముఖ పోరు హోరాహోరీగా ఉంటుందని భావించారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరిగాయి. ఈ పరిణామంతో బీజేపీ అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకపోయినా ఫరవాలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రాకూడదు అన్న స్టాండ్ తీసుకుందని, ఆ క్రమంలోనే బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగిందని అంటున్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడవ సారి అధికారంలోకి వచ్చినా ఇబ్బంది లేదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బలపడకూడదు అన్నదే బీజేపీ స్టాండ్ అని అంటున్నారు. అందుకు సంకేతమే బీజేపీ అధ్యక్షుడి మార్పు అని అనుకుంటున్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని కాంగ్రెస్ పార్టీ అందుకే విమర్శిస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ గానీ ఆ పార్టీ నాయకులు సైతం ఎన్నికల ప్రచార పర్వంలో తమ ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు తప్ప బీజేపీని పెద్దగా విమర్శిస్తున్న దాఖలాలు లేవు.

ఇక కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు మూడు ఒక్కటేనని విమర్శిస్తొంది. వివిధ సర్వే సంస్థల నివేదికలు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ అన్నట్లుగా చెబుతున్నాయి. ఇటీవల కాలం వరకూ కాంగ్రెస్ పార్టీకి వలసలు జరగ్గా, కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో టికెట్ లు ఆశించి భంగపడిన సీనియర్ నేతలు పలువురు గులాబీ గూటికి చేరుతున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్, బీజేపీల ఎత్తుగడలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాయా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

YS Viveka Case: వైఎస్ భాస్కరరెడ్డి ఎస్కార్ట్ బెయిల్ పొడిగిస్తూనే కీలక ఆదేశాలు జారీ చేసిన సీబీఐ కోర్టు


Share

Related posts

Himachal Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం .. లోయలో పడిన ప్రైవేటు బస్సు ..16 మంది మృతి

somaraju sharma

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

Siva Prasad

Pele Passed Away: ఫుట్ బాల్ దిగ్గజం పీలే కన్నుమూత

somaraju sharma