NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

చేసుకున్న వారికి చేసుకున్నంత… ఏబీ మీకు వర్తించేది ఇదే!!

 

 

భగవద్గీత లో…. ఒక మాట ఉంటుంది…. కష్టాలు సంతోషాలు గురించి మనిషి ఎక్కువ ఆలోచించే సమయంలో ఒకటి గుర్తు పెట్టుకో అంటాడు భగవానుడు “” ఈ సమయం వెళ్ళిపోతుంది “” అని… అంటే రోజులన్నీ ఒకేలా ఉండవు.. అటు ఇటు అవుతాయి… ఇటు అటు అవుతాయి… దానికి నీ బాధను, అహాన్ని తొలగించుకుని బతుకు అని… చిన్న మాటలో విస్తృత అర్థం.. అందుకే మీ రోజు వచ్చే సమయంలో ఎక్కువ ఫోజు కొట్టకండి… అంటారు పెద్దలు…. ఖచ్చితంగా ఇప్పుడు ఈ పదాన్ని ఏపీ పోలీసు సీనియర్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కచ్చితంగా చూపాలి..

ఎందుకంటే ఇప్పుడు ఫోకస్ మొత్తం జగన్ ఆయన మీద పెట్టనున్నారు.... దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఏబీ వెంకటేశ్వరరావు తో పాటు ఆయన కుటుంబ సభ్యులు భయం భయం తో బతుకుతున్నారు. తాజాగా ఆయన వెలిబుచ్చిన భయం ఏమిటంటే ఏ వెంకటేశ్వరరావు పై ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది అని.... ఆయన ఇప్పట్లో బయటకు రాకుండా చేసేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నారు. అంటే రాజకీయ ఆటలో బలైపోతున్న బలిపశువు ఏబీ వెంకటేశ్వరరావు...
ఏబీ వెంకటేశ్వరరావు… సీనియర్ పోలీస్ ఐపిఎస్ అధికారి… డీజీపి ర్యాంకు స్థాయి 1989 బ్యాచ్ అధికారి. కమ్మ కులానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు 2014 నుంచి 2019 వరకు టిడిపి హయాంలో ఏపీలో అన్నీ తానై నడిపించారు. చంద్రబాబు హయాంలో హోంమంత్రిగా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప కు పోలీసు శాఖ మీద ఒట్టు లేకపోవడంతో హోం మంత్రి స్థాయిలో ఏబీ వెంకటేశ్వరరావు చక్రం తిప్పారు. ఒక్కో సందర్భంలో హోం మంత్రి ఇచ్చిన చిన్నచిన్న ఆదేశాలు, చిన్నచిన్న బదిలీ అంశాలు కూడా ఏబీ వెంకటేశ్వరరావు పక్కన పెట్టేసేవారు అంటే టిడిపి హయాంలో ఆయన హవా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర డిజిపిగా ఉన్న ఎవరైనా సరే ఏబీ కార్యకలాపాల్లో ఏవి వ్యవహారాల్లో తలదూర్చే వారు కాదు. ప్రతి అంశంలోనూ ఏబీ వెంకటేశ్వరరావు మార్కు ఉండేది. ముఖ్యంగా పోలీసు శాఖకు తగిన అవసరాలు, నిధులు, బదిలీలు, పదోన్నతుల వ్యవహారాల్లో ఏబీ వెంకటేశ్వరరావు అన్నీ తానే అయి నిర్వహించేవారు. ఒక రకంగా ఆయన ఐపీఎస్ అధికారి అనే కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్లో అనధికార మంత్రిగా పని చేశారు అని చెప్పుకోవాలి. ఇంటిలిజెన్స్ చీఫ్ హోదాలో డైరెక్టుగా ముఖ్యమంత్రితో తనకు మాట్లాడే అవకాశం ఉండడంతో చంద్రబాబుకు అప్పటి రాష్ట్ర పరిస్థితి అనుగుణంగా నడిపించడం లోనూ ఏ బి కీలక పాత్ర పోషించారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు క్యాబినెట్లో పోలీసు శాఖ పరంగా మొత్తం అన్ని విషయాలను ఏబీ వెంకటేశ్వరరావు దగ్గరుండి చూసుకునేవారు. ఇది తన పరిధికి మించి తన అధికారాన్ని మించి ఐపీఎస్ అధికారి ప్రవర్తించిన ఘట్టం.

చినబాబు కు మొత్తం!!

పోలీసుశాఖ వ్యవహారాల్లో టిడిపిలో చినబాబు గా వ్యవహరించే లోకేష్కు ఏబీ వెంకటేశ్వరరావు తో అత్యంత దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు సూచనలతో లోకేష్ దగ్గరుండి పోలీసు బదిలీలు పదోన్నతులు విషయంలో భారీగా ముడుపులు తీసుకున్నారని, కమ్మ కులానికి చెందిన ఎక్కువమందిని తమకు అనుకూలమైన పోస్టింగులు వేశారని, కమ్మ కులం కాకపోతే వారిని లూప్ లైన్ లో పరిమితం చేశారని ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా టిడిపి హయాంలో పోలీస్ శాఖ విచ్ఛిన్నం జరిగి మొత్తం కమ్మ కులానికి చెందిన వారే కీలకమైన పోస్టుల్లో ఉన్నారంటూ పోలీసు శాఖలోని పెద్ద గొడవ జరిగింది. ప్రతి కీలకమైన పోస్టులు అమ్ముకుంటున్నారని లేకుంటే కమ్మ కులానికి చెందిన వారితో నింపుతున్నారు అని… ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్సిపి సైతం చంద్రబాబు హయాంలో జరిగిన పోలీసు సంస్కరణల విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. కమ్మ కులానికి చెందిన వారిని కీలకమైన పోస్టింగులు వేయడం లో ఏబీ పాత్ర ఎంతో ఉంది.
** పోలీసు శాఖలో కొన్ని కీలకమైన పోస్టింగులు ఎంతో డిమాండ్ తో కూడి ఉంటాయి. ఇవి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు వివిధ విభాగాల్లో కనిపిస్తాయి. కీలకమైన పోస్టింగులు డబ్బు అంటే డబ్బులు బాగా ముట్టేవి. వద్దు వద్దు అన్న ఆ స్టేషన్కు వచ్చి రెవిన్యూలను బట్టి ఆయా స్టేషన్ల పోస్టింగులు వేలం ద్వారా జరుగుతాయి. సబ్ ఇన్స్పెక్టర్ లకు తన పరిధిలో సీఐలకు సర్కిల్ పరిధిలో డీఎస్పీలు డివిజన్ పరిధిలో ఈ పోస్టింగ్ లో అమ్మకాలు టిడిపి హయాంలో ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా కమ్మ కులానికి చెందిన అధికారులు కాస్త తక్కువ డబ్బులు ఇచ్చిన కీలకమైన చివరి నిమిషంలో రద్దుచేసి వారికి కట్టబెట్టే వారు. ఇక నిధులు విధులు విషయం కూడా ఏవి వెంకటేశ్వరరావు కనుసన్నల్లోనే సాగింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎలాంటి పరిణామాలు ఉన్నాయి అనే విషయాలను నివేదించాల్సిన ఏబీ వెంకటేశ్వరరావు దాన్ని పక్కన పెట్టి ఇతర విషయాల్లో ఎంతో చురుగ్గా వ్యవహరించే వారు. ముఖ్యంగా చిన్న బాబు లోకేష్ కు దగ్గరుండి కొంత మొత్తాన్ని పంపారని ఆరోపణలు మూటగట్టుకున్నారు.

మెడకు చుట్టిన కేసు!!

ఇలా తన విధులు కాకుండా ఇతర విషయాల్లో ఎంతో చురుగ్గా ఉన్నా ఏ వెంకటేశ్వరరావు టీడీపీ హయాంలో చేసిన ఒక తప్పు జగన్ హయాంలో మొత్తం మెడకు చుట్టుకుంది. ఇజ్రాయిల్ నుంచి అనధికారికంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నకిలీ బిల్లులు ద్వారా ఫోన్ టాపింగ్ చేసే పరికరాలను కొనుగోలు చేశారని, దానికి ఏబీ వెంకటేశ్వరరావు దేశ భద్రతా నియమాలను ఉల్లంఘించారని, అలాగే నిధులను గోల్మాల్ జరిగిందని, ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు పేరు మీద వీటిని తీసుకొచ్చారని జగన్ ప్రభుత్వం వచ్చి రాగానే ఏబీ వెంకటేశ్వరరావు మీద వేటు వేసింది. సస్పెన్షన్లో ఉంచి సగం జీతం ఇవ్వడానికి సైతం కూర్చోబెట్టి జగన్ ప్రభుత్వం ఇష్టపడలేదు. సస్పెన్షన్ అయిన వారు ఎవరైనా సరే సగం జీతం ప్రభుత్వం చెల్లించలేదని ఓ కొత్త జీవో తీసుకొచ్చారు. కేవలం ఏబీ వెంకటేశ్వరరావు మీద ఉన్న కోపంతోనే జగన్ ఈ జీవోను తీసుకొచ్చారని సస్పెన్షన్కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు కు అప్పటి నుంచీ తన జీతం సొమ్ము కూడా అందడం లేదన్నది నిజం.
** న్యాయ పోరాటం చేసిన ఏవి వెంకటేశ్వరరావు కు న్యాయస్థానాల్లో సైతం చుక్కెదురైంది. అఖిల భారత సర్వీసు అధికారులను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని కోర్టులో స్పష్టం చేశాయి. దానికి సంబంధించిన ఆధారాలను ప్రభుత్వం సమర్పించడంతో కోర్టు ఏవి వెంకటేశ్వరరావు పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఆయన ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో పడిపోయారు. మరోపక్క తన వయస్సు అయిపోతున్న తరుణంలో… సస్పెన్షన్ లో ఇలాగే ఉంటే తర్వాత వచ్చే బెనిఫిట్ సైతం ఆయనకు రావు. దీంతో పాటు తాజాగా ఇప్పుడు ఆయన ఆందోళన చెందుతున్న అంశం ఏమిటంటే జగన్ ప్రభుత్వం మళ్లీ అన్నీ తిరగదోడి క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అంటే దేశ భద్రత చట్టం ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావు ను అరెస్టు చేసేందుకు అవకాశం ఉంది. దీనిలో అరెస్టయితే బయటకు రావడం అంత సులభమైన విషయం కాదు. అందుకే ఏ వెంకటేశ్వరరావు ఇప్పుడు అంత కలవరపడుతున్నారు.

బలి అయ్యింది మీరే!!

ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతం నుంచి సర్వీస్ స్థాయి అధికారులు గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలనలో ఉన్నప్పుడు తన మన, వ్యక్తిగత ఇష్టాలు, అభిమానం ప్రాతిపదికన మన పరిధికి మించి ఇష్టానుసారం వ్యవహరిస్తే, తను ఉంది కదా అని చంకనెక్కి తే ఎలా ఉంటుంది అనేది ఏవి ఉదంతంతో అఖిల భారత సర్వీసు స్థాయి అధికారులు నేర్చుకోవాల్సిన పాఠం. ఈ విషయంలో ఇప్పుడు చంద్రబాబుకు ఏమీ కాదు ఆయన కొడుకు లోకేష్ కు ఏమీ కాదు… బలి పశువు అయ్యేది మాత్రం ఏబీ వెంకటేశ్వరరావు మాత్రమే… దీన్నే రాజకీయం అంటారు…

author avatar
Comrade CHE

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju