Subscribe for notification

JC Brothers: జేసిపై ఈడీ ..టీడీపీ నేతలపై ఈడీ కన్ను..! లిస్ట్ లో 20 మంది నేతలు..!?

Share

JC Brothers: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మీద, వైసీపీ ప్రభుత్వం మీద కాస్త దూకుడుగా వెళుతున్నది జేసీ ప్రభాకరరెడ్డి అన్నది అందరికీ తెలిసిందే. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనస్థత్వం ఉన్న జేసి ప్రభాకరరెడ్డి నియోజకవర్గంతో పని లేకుండా అనంతపురం జిల్లాలో టీడీపీ బాధ్యతలను తనపై వేసుకుంటాననీ, మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైనా తాడిపత్రి మున్సిపాలిటీని గెలిపించారు జేసి ప్రభాకరరెడ్డి. టీడీపీలో దూకుడుగా వ్యవహరిస్తున్న జేసి ప్రభాకరరెడ్డి నివాసంలో రీసెంట్ గా ఈడీ తనిఖీలు జరిగాయి. ఈడీ అధికారులు జేసి నివాసానికి వెళ్లి ఇంట్లోకి బయటి వాళ్లను ఎవరినీ రానివ్వకుండా, ఇంట్లోని వారి అందరి సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని సోదాలు జరిపారు. ఈ సోదాల్లో ఈడీ అధికారులు ఏమేమి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు అనేది అధికారికంగా వెల్లడించలేదు.

JC Brothers ED case

JC Brothers: 2019 ఎన్నికలకు ముందూ..

అయితే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో టీడీపీ నాయకులు ఈడీకి టార్గెట్ అవ్వబోతున్నారా..? ఐటీకి, సీబీఐకి టార్గెట్ అవ్వబోతున్నారా..? అనే కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే.. 2019 ఎన్నికలకు ముందు అనేక మంది టీడీపీ నాయకుల ఇళ్లపై ఐడీ దాడులు జరిగాయి. మురళీమోహన్ కు చెందిన జయభేరీ సంస్థపై, అలానే కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు కు చెందిన సదరన్ వ్యాపార సంస్థలపైనా, బీదా రవిచంద్ర తదితరులకు చెందిన హాస్పటల్స్, ఇతర వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి. దాదాపు 30 మంది టీడీపీ మద్దతుదారుల వ్యాపార సంస్థలపై దాడులు చేపట్టి వారి ఆర్ధిక వ్యవహారాలు స్తంభించిపోయేలా ఐటీ రైడ్స్ జరిగాయి. ఇవన్నీ కూడా కేంద్రంలోని బీజేపీ మద్దతు జరిగాయని ఆనాడు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి చర్యల నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా నియోజకవర్గాల్లో పంపిణీలు చేయలేకపోయింది. టీడీపీ ఆర్ధిక మూలాలను అడ్డుకోగలిగారు.

టీడీపీలో ఆనాటి భయం మళ్లీ

ఇప్పుడు జేసి దివాకరరెడ్డి నివాసంపై ఈడీ దాడులు చేయడంతో టీడీపీలో ఆనాటి భయం మళ్లీ మొదలైంది. అయితే వాస్తవానికి అప్పటి దాడులకు ఇప్పుడు జరిగిన సోదాలకు సంబంధం లేదు. రాజకీయంగా గతంలో కేసులు నమోదు చేసినప్పటికీ కేంద్ర పెద్దల మద్దతుతో ఈ దాడులు జరగలేదని సమాచారం. ఏడాదిన్నర క్రితమే అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై జెసి బ్రదర్స్ కు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీపై, దివాకర్ ట్రావెల్స్ పైనా కేసులు నమోదు చేశారు. దానిలో భాగంగా తాజాగా ఈడీ రైడ్స్ జరిగాయి తప్ప వేరే అదనంగా నమోదు చేసి కేసులు ఏమీ కావని తెలుస్తొంది. ఇది కొత్తగా నమోదు చేసిన కేసు కాదు, పాత కేసులకు సంబంధించినవే. 2019, 2020లోనే వాళ్ల సిమెంట్ ఫ్యాక్టరీల్లో రూ.120 కోట్ల అవినీతికి పాల్పడినట్లు నోటీసులు ఇచ్చారు. ఏసీబీ తనిఖీలు జరిగాయి. వాళ్లను అరెస్టు చేస్తామన్నారు. సీబీఐకి ఫిర్యాదులు వెళ్లాయి. ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా జేసి బ్రదర్స్ లొంగలేదు. పార్టీ మారడానికి ఒప్పుకోలేదు.

JC Brothers: 20 మంది లిస్ట్ అంటూ టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం

ఇన్నాళ్లు వాళ్ల రాజకీయం సాగింది. ఇప్పుడు ఇడీ రంగ ప్రవేశం చేసింది. ఈడీ రంగ ప్రవేశం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నప్పటికీ ఎవరు చేయించారు..? ఎందుకు చేయించారు..? అనేది తర్వాత తెలుస్తాయి. అయితే దీనికి బీజేపీకి సంబంధం లేదు. కానీ టీడీపీ సోషల్ మీడియాలో మాత్రం 20 మంది లిస్ట్ తయారు అయ్యింది. వాళ్ల ఆస్తులపైనా ఈడీ రైడ్స్ జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలంటూ వాళ్లకు వాళ్లే ప్రచారం చేసుకుని భయపడుతున్నారు. వాస్తవానికైతే కేంద్ర ప్రభుత్వ మద్దతుతో బీజేపీ సపోర్టుతో జరుగుతున్నది కాదని సుస్పష్టం. ఇది పాత కేసే, పాత లావాదేవీలకు సంబంధించిన వ్యవహారమే.


Share
Special Bureau

Recent Posts

Ravi Teja: ఆ సినిమా ఔట్‌పుట్‌పై రవితేజ తీవ్ర నిరాశ.. ప్రమోషన్లకు రానని!

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…

2 mins ago

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

49 mins ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

2 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

4 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

6 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

7 hours ago