NewsOrbit
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

NTR: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై రియాక్ట్ అయిన జూనియర్ ఎన్టీఆర్..!!

NTR: ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడానికి వైసీపీ ప్రభుత్వం బిల్లు తీసుకురావడం.. ఆమోదం కూడా పొందుకోవడం జరిగింది. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తీవ్రస్థాయిలో టీడీపీ, మిగతా పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు.. స్పందించి ఎన్టీఆర్ పేరు తొలగింపు దివాలా కొరితనానికి నిదర్శనమని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైద్య విద్యకి ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలన్న సంకల్పంతో 1986లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఈ హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించారు.

Junior NTR reacts to the name change of NTR University
NTR

అనంతరం ఆయన మరణించాక ఎన్టీఆర్ జ్ఞాపకార్థం 1998లో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టినట్లు చంద్రబాబు తెలియజేశారు. 36 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి.. వైయస్సార్ పేరు ఎలా పెడతారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నారా లోకేష్ ఇంకా.. నందమూరి కుటుంబ సభ్యులు సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అన్ని కులాలు, మతాలు పార్టీలకు చెందిన వ్యక్తి. ఆయన పేరుని ఎలా తొలగిస్తారు అని ఎన్టీఆర్ కుటుంబం ఖండించడం జరిగింది.

Junior NTR reacts to the name change of NTR University
NTR

కాగా తాజాగా ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ విశేష ప్రజాధరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైయస్సార్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగుజాతి చరిత్రలో వారి స్థాయిని తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపి వేయలేరు అని తారక్ స్పందించడం జరిగింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?