NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కూట‌మి పంతం పాలిటిక్స్.. టీడీపీకి దెబ్బ ప‌క్క‌గా వేసి చూపిస్తారా…!

జ‌గ‌న్‌ పాలనకు వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో జగన్‌ని గద్దె దింపాలన ఏకైక లక్ష్యంతో మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఎమ్మిగ‌నూరు నియోజకవర్గంలో మాత్రం మూడు పార్టీల అభ్యర్థులు ఒకరికి ఒకరు సహకరించకపోవడం గ‌మ‌నార్హం. ఎన్ని సమస్యలు ఉన్నా అధికారం చేపట్టాక వాటిని పరిష్కరించుకుందాం అని కూటమి అధినేతలు ఆలోచనలో ఉంటే వారి పార్టీ నేతలు మాత్రం మా పంతం మాదే అంటూ నియోజకవర్గాల్లో ఎవరికి వారుగా ఉంటున్నారు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని మూడు పార్టీల ఇన్చార్జిలు ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గంలో బిజెపి ఇన్చార్జిగా మురారి రెడ్డి, జనసేన ఇన్చార్జిగా రేఖ గౌడ్, తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా పివి జయ నాగేశ్వర్‌రెడ్డి కొనసాగుతున్నారు. అయితే కూటమి అభ్యర్థిగా టిడిపి నేత బివి జయ నాగేశ్వర రెడ్డిని ప్రకటించారు. టికెట్ దక్కించుకున్న జయనాగేశ్వర్‌ రెడ్డి బీజేపీ, జనసేన నేతలను కలుపుకొని వెళ్లడం లేదన్న టాక్ జోరుగా వినిపిస్తోంది.

ఇక‌, జ‌య‌తో పని చేసేందుకు ఆ పార్టీ నేతలు సముఖంగా లేరనే చర్చ నడుస్తోంది. ఈ మధ్య జరిగిన ప్రజాగళం విషయంలో కూడా ఈ విభేదాలు బయటపడ్డాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన ప్రజా గళం సభకు జనసేన, బిజెపి నాయకులు దూరంగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయ నాగేశ్వర్‌ రెడ్డి ప్రవర్తనే కారణంగా నేతలు చెబుతున్నారు. ఆయన వైఖరితోనే జన సేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రజా గళానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.

ఎలాగైనా 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో జనసేన, బిజెపితో పొత్తు ఏర్పడింది. ఇది క్షేత్రస్థాయిలో నేతల తీరుతో అధినేత లక్ష్యానికి తూట్లు పొడిచేలా కనిపిస్తోంది. వర్గ విభేదాలతో కూటమి పార్టీలకు నష్టం చేకూర్చే ఉందనే విమర్శ గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బివి జయ నాగేశ్వర్‌రెడ్డి బీజేపీ, జనసేన నాయకులను పట్టించుకోవడం లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారానికి కూడా పిలవడం లేదని టాక్. వారి పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు.

అందుకే టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు బీజేపీ, జనసేన నేతలు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీని పై సొంత పార్టీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిత్రపక్షాలతో సఖ్యతగా లేకుంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే అంటున్నారు. ఈ విభేదాలు వైసీపీకి లాభిస్తాయని భయపడుతున్నారు. వీరి మధ్య సమన్వయం కుదిర్చిలా అధినాయకత్వం చర్యలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కొందరు నాయకులు ఫిర్యాదుల చేసినట్టు తెలిసింది. చివ‌రకు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju