NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TTD Board Member: ఆయన వద్దన్నాడు..! ఈయనకు వరించింది..!!

TTD Board Member: రాజకీయాల్లో కొందరు నాయకులకు పదవులు ఆశించినా రావు. కానీ కొందరికి అనూహ్యంగా పదవులు వస్తుంటాయి. జాబితాలో చివరి వరకూ ఉన్న పేర్లు గల్లంతు అవుతుంటాయి, కొత్త పేర్లు వస్తుంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డైరెక్టర్ పదవికి అంటే వివిధ రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రముఖులు, కోటీశ్వరులు, రాజకీయ పార్టీ నేతలు ఎగిరి గంతేస్తారు. ఒక్క సారి అవకాశం వస్తే చాలు అనుకునే వారు ఉంటారు. అయితే మంత్రి పదవిపై ఆశపెట్టుకున్న ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే టీటీడీ డైరెక్టర్ పదవి పట్ల విముఖత వ్యక్తం చేశారు. టీటీడీ డైరెక్టర్ పదవి పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకి అనూహ్యంగా ఆ పదవి దక్కింది.

mla baburao rejects TTD Board Member
mla baburao rejects TTD Board Member

విషయంలోకి వెళితే..జగన్మోహనరెడ్డి సర్కార్ టీటీడీ పాలకమండలిని ప్రకటించింది. 28 మంది సభ్యులతో (నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు) పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సుధాకర్ లను ప్రభుత్వం నియమించింది. పాలకమండలిలో విశాఖ జిల్లా పాయికారావుపేట ఎమ్మెల్యే గోళ్ల బాబూరావును ఎస్సీ కోటాలో టీటీడీ డైరెక్టర్ గా నియమించాలని సీఎం జగన్మోహనరెడ్డి భావించారు. టీటీడీ సభ్యుల జాబితా మీడియాకు లీక్ కావడంతో డైరెక్టర్ గా గోళ్ల బాబూరావు పేరు ఉండటంతో పలువురు ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అయితే ఆయన టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు మెంబర్ పదవిని ఆయన తిరస్కరించారు.

mla baburao rejects TTD Board Member
mla baburao rejects TTD Board Member

మంత్రి పదవి ఆశిస్తే తనకు టీటీడీ పదవి ఇవ్వడం అవమానించడమేనని బాబూరావు పేర్కొన్నారు. పాదయాత్ర సమయంలో జగన్ వెంట నడిచిన వారిలో తాను ముందు వరుసలో ఉన్నానని పేర్కొన్న బాబూరావు..తనకు అన్యాయం జరిగిందంటూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. బాబూరావు డైరెక్టర్ పదవిని తిరస్కరించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను టీటీడీ  డైరెక్టర్ జాబితాలో చేర్చారు. బాబూరావు కాదనడంతో సంజీవయ్యకు అనూహ్యంగా టీటీడీ డైరెక్టర్ పదవి దక్కింది.  శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం కోసం ఎందరో తపిస్తుండగా  వచ్చిన అవకాశాన్ని ఓ నేత కాలదన్నుకోవడం, మరో నేతకు అవకాశం లభించడం అంతా శ్రీవారి దయేనేమో. టీటీడీ అవకాశాన్ని వదులుకున్న గోళ్ల బాబూరావుకు రాబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు లభిస్తుందో లేదో వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju