Nara Lokesh: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటలకు సీబీఐ అధికారులు అరెెస్టు చేయగా, ఆదివారం వేకువజామున ఏసీబీ కోర్టు లో హజరుపర్చారు. చంద్రబాబుకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయనను రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

ఈ నేపథ్యంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజోలు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న నారా లోకేష్ శనివారం ఉదయమే విజయవాడ బయలుదేరి వచ్చారు. ఆదివారం ఏసీబీ కోర్టులో బెయిల్ వస్తే సోమవారం యధావిధిగా యువగళం కొనసాగించే అవకాశాలు ఉండగా, ఏసీబీ కోర్టులో వ్యతిరేక తీర్పు రావడంతో నారా లోకేష్ .. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు న్యాయనిపుణులతో చర్చించారు.
సోమవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేసే అవకాశం ఉండటంతో లోకేష్ తన పాదయాత్రకు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. చంద్రబాబు కు బెయిల్ మంజూరు అయి రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాతనే మరల నారా లోకేష్ పాదయాత్ర కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు.
Big Breaking: చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు