NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పీలేరు మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్ రెడ్డి.. ఆయన ప్రత్యేకత ఏమిటంటే..?

టీడీపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నఅన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్ రెడ్డి వైసీపీ చేరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీనాథ్ రెడ్డి తో పాటు పీలేరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు జీవిీ రాకేష్ రెడ్డి, ఎం వెంకట కృష్ణారెడ్డి, వి ఉమాకాంత్ రెడ్డి, బి నరేందర్ రెడ్డి, జి నరేష్ కుమార్ రెడ్డిలు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.

Pileru former tdp mla gv srinath reddy joined ysrcp

జీవీ శ్రీనాథ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇది

టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉన్న శ్రీనాథ్ రెడ్డి ఎన్టీఆర్ ప్రభంజనంలో 1994లో పీలేరు నియోజకవర్గం నుండి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఆ తరువాత 1999, 2004 ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుండి పోటీ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. 2009 ఎన్నికల్లో శ్రీనాథ్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో 2009లో పీలేరు నుండి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తన నియోజకవర్గంలో పట్టుపెంచుకునేందుకు జీవీ శ్రీనాథ్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు,. ఆ తర్వాత టీటీడీ బోర్డు సభ్యుడు పదవి ఇచ్చారు. 2014 ఎన్నికలకు ముందు కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి సమైక్యాంధ్ర పార్టీ స్థాపించడంతో శ్రీనాథ్ రెడ్డి కూడా ఆయన వెంటే నడిచారు. సమైక్యాంధ్ర అభ్యర్ధిగా పోటీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి కోసం శ్రీనాథ్ రెడ్డి పని చేశారు. ఈ ఎన్నికల్లో చింతల రామచంద్రారెడ్డి వైసీపీ నుండి గెలిచారు.

Pileru former tdp mla gv srinath reddy joined ysrcp

 

రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వచ్చిన నేపథ్యంలో బొజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా మంతనాలు జరిపి శ్రీనాథ్ రెడ్డి టీడీపీలో చేరారు. ఆ తర్వాత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ లో చేరడంతో శ్రీనాథ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో పక్క  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి లకు దశాబ్దాల తరబడి తీవ్రమైన రాజకీయ వైరం ఉంది. అయినప్పటికీ శ్రీనాథ్ రెడ్డిని వైసీపీలో చేర్చుకునేందుకు 2017లోనే పెద్దిరెడ్డి తమ మధ్య ఉన్న వైరాన్ని పక్కనపెట్టి ఆయన ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. ఈ పరిణామం ఆనాడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో శ్రీనాథ్ రెడ్డి టీడీపీలోనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇవ్వగా ఓటమి పాలైయ్యారు. 2024 ఎన్నికల్లోనూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికే టీడీపీ టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉండటంతో శ్రీనాథ్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. పీలేరు నియోజకవర్గంలో వైసీపీని మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా శ్రీనాథ్ రెడ్డికి భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని హామీలు ఇవ్వడంతో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నట్లు సమాచారం.

రాష్ట్రవిభన అంశంపై ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల సంచలన కామెంట్స్

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?