NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh Vs RK Roja: లోకేష్ ట్వీట్ కు మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ట్వీట్ .. లోకేశ్ నీ లొకేషన్ ఎక్కడ అంటూ..

AP Minister RK Roja Slams Nara Lokesh

Nara Lokesh Vs RK Roja: సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని విమర్శిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ట్వీట్ కు మంత్రి ఆర్కే రోజా కౌంటర్ కామెంట్స్ తో ట్వీట్ చేశారు. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ను ఏపీ సీఐడీ అరెస్టు చేసి జైల్ కు పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. రూ.42వేల కోట్ల ప్రజాధనం దోచేసి, సీబీఐ, ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ 1 అయినా పదేళ్లుగా బెయిల్ పై ఉన్న ఆర్దిక ఉగ్రవాది జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తూ, నీతిమంతులన్ని జైలు పంపుతున్నాడని విమర్శించారు. జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిల్ పై ఉంటే, జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్ జైలులో ఉన్నారని లోకేష్ పేర్కొన్నారు.

AP Minister RK Roja Slams Nara Lokesh
AP Minister RK Roja Slams Nara Lokesh

లోకేష్ చేసిన ఈ ట్వీట్ కు మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ట్వీట్ చేశారు. దేశంలోనే అవినీతి అనకొండ అయిన చంద్రబాబుకు తొలి కస్టడీడే శుభాకాంక్షలు అని వ్యంగ్యం ప్రదర్శించారు రోజా. పచ్చ మీడియా ను అడ్డం పెట్టుకుని మీరెన్ని తప్పులు చేసినా ప్రజలకు కనబడవు అనే రోజులు పోయాయి లోకేష్ .. మీ నాన్న చేసిన ప్రతి స్కాం ను కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు, న్యాయస్థానం ముందు ఉంచాం. చట్ట ప్రకారం చంద్రబాబు నాయుడు వాటిని ఎదుర్కొంటున్నాడు. కుంభకోణాల్లో భాగస్వామ్యం వున్న ప్రతి ఒక్కరూ చట్టానికి తలవంచాల్సిందే.. జైలుకు వెళ్లాల్సిందే.

AP Minister RK Roja

“ఖైదీ నెంబర్ 7691 కడుపున పుట్టిన నారా లోకేష్ నీ లొకేషన్ ఎక్కడ..? తండ్రి అడ్డంగా తినేసి జైలుకు వెళితే, మా నాన్న ఎలా పోయినా ఫర్లేదు నేను మాత్రం అరెస్టు కాకూడదని పారిపోయిన లోకేశ్ ఆంధ్రకు ఎప్పుడొస్తావ్..? అని మంత్రి రోజా ప్రశ్నించారు. తల్లి, భార్య మీద మీ భారం వదిలేసి పలాయనం చిత్తగించిన పులకేశ్ మీ జాడ ఎక్కడ.? మీ నాన్న అవినీతిపై బహిరంగ చర్చకు రమ్మన్నావ్.. నువ్వేమో రాష్ట్రం వదిలి పారిపోయావ్, మీ మామ బాలయ్య అసెంబ్లీ వదిలి పారిపోయాడు. చంద్రబాబు గజదొంగ అని అసెంబ్లీ సాక్షిగా నిరూపించడానికి మేం సిద్దం.. కాదని నిరూపించే ధైర్యం ఉందా.? ధైర్యం ఉంటే అసెంబ్లీకి మీలో ఎవరు వస్తారో రండి.. ఇది మా వైసీపీ సవాల్” అంటూ రోజా ట్వీట్ చేశారు.

Chandrababu Arrest: ముగిసిన చంద్రబాబు తొలి రోజు సీఐడీ విచారణ .. ఎన్ని గంటలు సాగిందంటే..?

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N