Pocharam Srinivas Reddy: పోచారంకు కరోనా పాజిటివ్ నిర్ధారణ..! ప్రముఖుల్లో గుబులు..!!

Share

Pocharam Srinivas Reddy: కరోనా తగ్గుముఖం పట్టింది.. వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి అయ్యాయి కదా.. ఇక భయపడనవసరం లేదు అన్నట్లు సాధారణ ప్రజానీకం మొదలు కొని ప్రముఖుల వరకూ ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు ధరించడం లేదు. ఇంకా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. పలు జాగ్రత్తలు పాటిస్తున్న ప్రముఖులూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇటీవల ఏపి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వివరించారు. వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చేరినట్లు పోచారం తెలిపారు.

Pocharam Srinivas Reddy: ప్రముఖుల్లో గుబులు

తనకు కరోనా పొజిటివ్ నిర్ధారణ అయ్యిందని పేర్కొన్న పోచారం.. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గత ఆదివారం పోచారం మనుమరాలి వివాహ వేడుక హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా ఇరు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హజరైయ్యారు. ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇతర ప్రముఖులు హజరై వధూవరులను ఆశీర్వదించారు. పోచారంకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం మీడియా ద్వారా వెల్లడి కావడంతో ఆ వివాహ వేడుకకు హజరైన చాలా మందిలో గుబులు రేగుతోంది. లక్షణాలు ఉన్నా లేకున్నా ఆయనతో సన్నిహితంగా ఉన్న వారు అంతా ఇప్పుడు పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. పోచారం మనుమరాలి వివాహ వేడుకకు హజరైన చాలా మంది ప్రముఖులు మాస్కులు ధరించపోవడం గమనార్హం.

telangana assembly speaker Pocharam Srinivas Reddy tested covid 19 positive

 


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

2 hours ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

3 hours ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

5 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

5 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

6 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

6 hours ago