Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలు పట్టణంలో కొనసాగుతోంది. పాదయాత్ర పాతబస్తీ చేరుకున్న సమయంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్, ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఎదురెదురుపడటంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యే హఫీజ్ ను పోలీస్ జీపులో ఎక్కించి తీసుకువెళ్లారు. ఆయన అనుచరులను అక్కడి నుండి పంపించి వేశారు. అంతకు ముందు లోకేష్ ను మహాజన సోషల్ సమైక్యతా సంఘం ప్రతినిధులు కలిసి తమ సమస్యలను తెలియజేశారు.

అనంతరం జిల్లా కోర్టు భవనం వద్దకు పాదయాత్ర చేరుకోగా పలువురు న్యాయవాదులు లోకేష్ ను కలిసి సంఘీభావం తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే హైకోర్టు బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని వారికి లోకేష్ హామీ ఇచ్చారు. కర్నూలుకు కేటాయించిన జ్యూడిషియల్ అకాడమిని జగన్ తరలించారని అన్నారు. హైకోర్టు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా జగన్ మోసం చేశారని తెలిపారు. అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని సుప్రీం కోర్టులో వైసీపీ ప్రభుత్వం తెలిపిందనీ, విశాఖలో హైకోర్టు అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో అన్నారని లోకేష్ తెలిపారు. జగన్ లా మాట మార్చి మడమ తిప్పే బ్యాచ్ తమది కాదని లోకేష్ అన్నారు.
అనంతరం కర్నూలు 50వ డివిజన్ టిడ్కో బాధితులు లోకేష్ ను కలిశారు. తమ డివిజన్ లో 1200 మంది గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల కోసం లక్ష చొప్పున చెల్లించామనీ, ఇంత వరకూ ఇళ్లను పూర్తి చేసి ఇవ్వలేదని విన్నవించారు. అలానే పలు స్థానిక సమస్యలను లోకేష్ కు విన్నవించారు. టీడీపీ హయాంలో 90 శాతం పనులు కాగా టిడ్కో ఇళ్లను మిగిలిన పనులు పూర్తి చేసి ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని లోకేష్ విమర్శించారు.
Manipur Violence: హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్న తెలుగు విద్యార్ధులు