Chandrababu-ACB Court: ఆంధ్రప్రదేశ్ లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును నిన్న సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నంద్యాలలో అరెస్టు చేసిన చంద్రబాబును సాయంత్రానికి విజయవాడకు తీసుకువచ్చిన సీఐడీ అధికారులు వెంటనే కోర్టులో హజరుపర్చకుండా సిట్ కార్యాలయంలో ఆయనను సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఇక వేకువ జామున ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం జయవాడ ఏసీబీ కోర్టులో హజరుపర్చారు సీఐడీ అదికారులు.

ఆ తర్వాత ఏసీబీ కోర్టులో ఇరుుపక్షాల వాదనలు వాడివేడిగా జరిగాయి. న్యాయమూర్తి జస్టిస్ హిమబిందు ముందు చంద్రబాబు తరపు వాదనలు విన్నారు. చంద్రబాబు తరఫు ముగ్గురు న్యాయవాదులను వాదించేందుకు అనుమతి కోరగా.. జడ్జి మాత్రం ఇద్దరికే అవకాశం ఇస్తామని చెప్పడంతో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ద్ లూథ్రా తో పాటు పోసాని వెంకటేశ్వర్లు మాత్రమే హజరైయ్యారు.

వాదనల సమయంలో న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా.. చంద్రబాబుపై సెక్షన్ 409 వర్తించదని వాదించారు. సరైన సాక్ష్యాలు లేకుండా సెక్షన్ 409 కింద అరెస్టు చేయడం కుదరదని పేర్కొన్నారు. అంతే కాకుండా సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చలేదన్నారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కాంకూ ఇందులో సీఐడీ పెట్టిన సెక్షన్లకూ సంబంధమే లేదని అన్నారు. ఇదే సందర్బంలో చంద్రబాబు కూడా తన వాదనలు వినాలని న్యాయమూర్తిని కోరగా అనుమతి ఇచ్చారు.

తన అరెస్టు అక్రమం అని చంద్రబాబు విన్నవించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు తెలిపారు. కేసులో తన పాత్ర లేకపోయినా ప్రభుత్వం రాజకీయ కక్ష్యతోనే తనుపై కేసు నమోదు చేయడం జరిగిందని ఆరోపించారు. అనంతరం సీఐడీ తరఫున ప్రభుత్వ న్యాయవాది అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందనీ, అందుకు సంబంధించి ఆధారాలు ఉండటం వల్లనే కేసు నమోదు చేయడం జరిగిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది నిందితుల్ని సీఐడీ అరెస్టు చేసిందని చెప్పారు. ఈ కేసులో ఏ 37గా చంద్రబాబు ఉన్నారని తెలిపారు.చంద్రబాబును రిమాండ్ కు తరలించాలని కోరారు.

చంద్రబాబు కోర్టు ఆవరణలో ఉండగానే ఆయన ఊహించని విదంగా ఈ కేసులో నారా లోకేష్ అచ్చెన్నాయుడుల పేర్లను ప్రస్తావించారు. రిమాండ్ రిపోర్టులో ఆ ఇద్దరి పేర్లను చేర్చారు. ఇరుపక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. సాయంత్రానికి తీర్పు వెలవడనుంది. అయితే తీర్పు వెలువడకముందు కోర్టు సమీపంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అక్కడ అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేయడంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.