NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Holidays For Students: విద్యార్దులకు గుడ్ న్యూస్ .. వరుసగా 13 రోజులు పాఠశాలలకు ఫెస్టివల్ హాలిడేస్

Good news for students.. 13 consecutive days are festival holidays for schools
Advertisements
Share

Holidays For Students: vపండుగ సెలవులు వస్తున్నాయి అంటే విద్యార్ధులకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎక్కువ రోజులు పాఠశాలలకు సెలవులు వస్తే పిల్లల తల్లిదండ్రులు వారి స్వగ్రాామాలకు వెళ్ళి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి వస్తుంటారు. ఉద్యోగాల రీత్యా ఎక్కువ మంది గ్రామాలను వదిలి పట్టణాలు, నగరాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటారు. మరి కొందరు పిల్లల చదువుల కోసం గ్రామాల్లో వ్యవసాయ భూములను కౌలుకు ఇచ్చుకుని పట్టణాల్లో నివాసం ఉంటుంటారు.

Advertisements
Good news for students.. 13 consecutive days are festival holidays for schools
Good news for students 13 consecutive days are festival holidays for schools

సెలవులు వచ్చిన సమయాల్లో నానమ్మ, తాతయ్య, అమ్మమ్మల ఇళ్లకు వెళ్లాలని చిన్నారులు భావిస్తుంటారు. మరి కొందరు హాలిడే ట్రిప్స్ కు ప్లాన్ చేసుకుంటుంటారు. అందుకే వరుస సెలవులు వస్తే విద్యార్ధులు ఎగిరి గంతేస్తుంటారు. అక్టోబర్ నెలలో ఎక్కువ సెలవు దినాలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు 28 సాధారణ సెలవులు. 24 ఇచ్చిక సెలవులు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisements
Good news for students.. 13 consecutive days are festival holidays for schools
Good news for students 13 consecutive days are festival holidays for schools

ఆదివారం, సెకండ్ శనివారాల్లో ఎలాగూ కార్యాలయాలకు సెలవు. ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవులతో పాటు ఉన్నతాధికారుల అనుమతితో మరో అయిదు ఆప్షనల్ సెలవులు పొందే అవకాశం ఉంటుంది. ఇక పాఠశాలల విషయం చూసుకుంటే ఈ ఏడాది జూన్ 12 న 2023 – 24 విద్యాసంవత్సరానికి సంబంధించి 1 నుండి పది తరగతులకు అకడమిక్ క్యాలెండర్ ను తెలంగాణ సర్కార్ జూన్ 6న విడుదల చేసిన విషయం తెలిసిందే.

Good news for students.. 13 consecutive days are festival holidays for schools
Good news for students 13 consecutive days are festival holidays for schools

ఈ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు పాఠశాలలు పని చేస్తాయి. జూన్ 12న ప్రారంభమైన విద్యా సంవత్సరం 2024 ఏప్రిల్ 23న ముగుస్తుంది. ఆ తర్వాత 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఇక ఈ ఏడాది దసరా సెలవుల విషయానికి వస్తే అక్టోబర్ 13 నుండి 25వ తేదీ వరకూ 13 రోజుల పాటు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఆ తర్వాత సంక్రాంతి సెలవులు జనవరి 12 నుండి 17వ తేదీ వరకూ ఆరు రోజులు ఉంటాయని వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో ఇప్పటికే పది రోజులు ముగియగా, మిగిలిన 20 రోజుల్లో వరుస సెలవులు రానున్నాయి.

Good news for students.. 13 consecutive days are festival holidays for schools
Good news for students 13 consecutive days are festival holidays for schools

ఈ నెల 17వ తేదీ ఆదివారం కావడంతో పబ్లిక్ హాలిడే ఉంటుంది. ఇస సోమవారం వినాయక చవితి సందర్బంగా 18వ తేదీ కూడా సెలవు. అంతే కాకుండా ఆదివారాలు మిహహా 28వ తేదీ గురువారం మిలాద్ ఉన్ నబీ (మహమ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్బంగా పాఠశాలలకు సెలవు ప్రకటించనున్నారు. ఇక వచ్చే నెలలో వరుసగా దసరా సెలవులు విద్యార్ధులకు ఆనందాన్ని ఇవ్వనున్నాయి.

Share
Advertisements

Related posts

Maharashtra Political Crisis: ‘మహా’ రాజకీయం – కేంద్రం కీలక నిర్ణయం

somaraju sharma

Huzurabad Bypoll: ఈటలకు చుక్కలు చూపుతున్న కేసీఆర్..! ఎన్నెన్ని స్ట్రాటజీలో..!!

somaraju sharma

గుడ్లలో రంగు ద్వారా మంచివో కావో తెలుసుకోండి ఇలా !

Kumar