NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వివేకా హత్య కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సీబీఐ .. మరో సారి సునీత దంపతులను విచారించిన సీబీఐ

ys viveka murder case cbi questions on ys sunitha reddy and rajasekhar reddy over letter

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో వరుస విచారణలు చేస్తున్నది. ఇవేళ అవినాష్ రెడ్డి విచారణకు హజరు కావాల్సి ఉండగా, తనకు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల హజరు కాలేకపోతున్నాననీ, మూడు నాలుగు రోజులు సమయం కావాలని కోరుతూ లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీబీఐ ఈ నెల 19వ తేదీన విచారణ కు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. మరో పక్క అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరులుగా భావిస్తున్న నాగళ్ల విశ్వేశ్వరరెడ్డి, వర్రా రవీంద్ర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి లను ఇవేళ సీబీఐ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. అంతే కాకుండా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి లను ఇవేళ విచారణ చేశారు.

ys viveka murder case cbi questions on ys sunitha reddy and rajasekhar reddy over letter
ys viveka murder case cbi questions on ys sunitha reddy and rajasekhar reddy over letter

 

ఇంతకు ముందు రెండు సార్లు ఈ ఇద్దరు సీబీఐ ఎదుట హజరు కాగా, తాజాగా మరో సారి విచారణకు రావడంతో ఉత్కంఠ నెలకొంది. విచారణ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ అధికారులు మొదటి నుండి రికార్డింగ్ చేస్తున్నారు. ఇవేళ కూడా సునీత, రాజశేఖరరెడ్డి స్టేట్ మెంట్ లను సీబీఐ నమోదు చేసింది. ప్రధానంగా వివేకా రాసిన లేఖ కు సంబంధించి ప్రశ్నలు అడిగి సమాధానాలు సేకరించినట్లు గా తెలుస్తొంది. ఘటనా స్థలంలో దొరికిన లేఖను వెంటనే పోలీసులకు అందజేయకుండా, ఆలస్యంగా ఇవ్వడానికి కారణాలు ఏమిటి అనే దానిపై ఆరా తీసినట్లుగా తెలుస్తొంది.

 

సీబీఐ అధికారులు వ్యక్తి టార్గెట్ గా విచారణ జరుపుతున్నారని అవినాష్ రెడ్డి ఇంతకు ముందు ఆరోపించారు. వివేకా సూసైడ్ నోట్, వివేకా రెండో భార్య వ్యవహారం, కుటుంబంలో ఆస్తుల వివాదం తదితర విషయాలను ఎందుకు పరిశీలన చేయడం లేదంటూ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సీబీఐ సిట్ బృందం అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జూన్ 20వ తేదీ నాటికి విచారణ పూర్తి చేయాల్సి ఉండటంతో దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ వేగం పెంచింది.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం వైఎస్ జగన్

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju