NewsOrbit
Featured బిగ్ స్టోరీ

చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, మహేశ్ ఏం చేస్తున్నారు?

ఇప్పుడు అందరూ సోనూ గురించి మాట్లాడుతున్నారు… చిరంజీవి గురించి, బాలకృష్ణ గురించి… ప్రభాస్, మహేశ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు… అవును వీరంతా దేశం గర్వించే సినీతారలు.

Tollywood top heroes remuneration - tollywood

 

వీరేకాదు ఇంకా టాలీవుడ్, బాలీవుడ్ బాద్షాలు చాలా మందే ఉన్నారు. వాళ్లంతా కూడా కోట్లాదిపతులు. వారందరికీ సమాజం పట్ల గర్వం, గౌరవం రెండూ ఉంటాయ్. కానీ అవసరానికి మాత్రం వారు ముందుకు రారు. ఎందుకంటే వారికి సమాజం నుంచి తీసుకోవడమే తెలుసా… అన్న అనుమానం కలుగుతోంది. ఊరికి ఇవ్వకుంటే బలిసిపోతామంటూ సినిమాల్లో డైలాగులు మాత్రం ఊకదంపుడుగా చాలా చెప్పేస్తారు. సందర్భం ఉన్నా లేకున్నా… తమ నోటికి పవర్ ఫుల్ గా వచ్చేలా మాటల తూటాలు పేలుతారు. కానీ సమాజానికి ఇంత ఆపత్కాలంలో సాయం చేయడానికి మాత్రం వారు ముందుకు రావడం లేదు.

అందరూ సోనూ సూద్‎ను అభినందిస్తున్నారు. ఆయన అలా చేశాడని… ఇలా చేశాడని… ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన చేస్తున్న సాయం విలువ తెలిసి కూడా ఎవరూ స్పందించడం లేదు. ప్రభుత్వాలు చేసే మేళ్లు చేస్తూనే ఉన్నాయ్. కానీ కోట్లకు పడగలెత్తిన మన పెద్ద సార్లూ మాత్రం మాటలకే పరిమితమైపోయారు. కోట్లాది రూపాయలు పోగేసుకొని ఏం చేసుకుంటామన్న స్పృహ కూడా వీరికి లేదు. సాయం అవసరమున్నోడికే సాయం విలువ తెలుస్తుంది. వీరికి ఎవరి సాయం అవసరం లేదట్టుంది అందుకే వీరెవరూ కూడా స్పందించడం లేదు. కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం సాయం చేసిన సినీ పెద్దలు… సామాన్యుడు లేకుంటే వారి సినిమాలు ఎవరూ చూస్తారు. రేపోమాపో సినిమా హాళ్లు కూడా ఓపెన్ కాబోతున్నాయ్. కరోనాతో చస్తూ బతుకుతున్న సామాన్యులు రేపు సినిమా హాళ్లకు వచ్చి వీరి సినిమాలను జయప్రదం చేయాలి కామాలి. తెలుగు నేలపై ఇప్పుడు ఉద్యోగాలు లేక, జీవనోపాధి కరువు, కరోనాతో జనం బెంబేలెత్తిపోతున్నారు. చిరంజీవి సామాజిక స్పృహ గురించి ప్రశ్నించాలన్న ఉద్దేశం ఇక్కడ ఎవరికీ లేదు. కానీ… ఆయన చేయాల్సింది చాలా ఉంది. ఇంకా ఏం సాధిస్తారు. జనం మరచిపోలేని సేవలు చేయవచ్చు. ఆయన కోడలు అపోలో ఆసుపత్రి భాగస్వామిగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అపోలో సేవలు చాలానే అవసరం ఉంది. కార్పొరేట్ ఆగడాలను అడ్డుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు.

జనం చస్తుంటే ఆ ఆసుపత్రి, ఈ ఆసుపత్రి అని కాకుండా యధేచ్ఛగా దోచేసుకుంటున్నాయ్. ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తుంది. కేసీఆర్ గతంలో చెప్పినట్టుగా కరోనా తప్పుడు ప్రచారం చేసేవాళ్లకు కరోనా వస్తుందన్నట్టుగా… ప్రజలను మోసం చేస్తున్నవాళ్లకు కూడా ఎందుకు రాదని ప్రశ్నించాల్సి ఉంది. ఇక బాలయ్య స్వయంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బాధ్యతలు చూస్తున్నారు. ఆయన తలచుకుంటే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ ప్రజలకు సేవ చేసే అవకాశం సుస్పష్టం. ఆయన తలచకుంటే కార్పొరేట్ ఆసుపత్రులు బాధ్యతలను గుర్తుచేయగల సత్తా ఉన్న మనిషి. మహేశ్, ప్రభాస్ ఇప్పుడు దేశం గర్వించదగ్గ హీరోలు. వారు ఇప్పుడు కరోనా వారియర్స్ గా ఎందుకు ముందుకు రారు. వారంతా ప్రజలకు మేమున్నామన్న సపోర్ట్ ఇస్తే అది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది కదా… ఆ బాధ్యత లేదా వీరికి… ఆసుపత్రులు కోట్లను పోగేసుకునే పనిలో పడితే… అందుకు రాజకీయ శక్తులన్నీ సపోర్ట్ చేయడం ఈ విషాదాంతానికి పరాకాష్ట.

ఇప్పుడు అందరి ముందు ఉన్న లక్ష్యం ఒక్కటే. కరోనాతో ఒక్కరు కూడా చనిపోకుండా కాపాడటం. ఆ లక్ష్యానికి సమాజంలోని అన్ని వర్గాల పెద్దలు చేతులు కలపాల్సి ఉంది. పాలకులు చేయూత అందించడానికి సిద్ధమవ్వాలి. ఒకరికొకరు ఉంటేనే కదా సమాజం. ఆ సమాజం ఉండాలంటే వీళ్లందరూ కళ్లు తెరవాలి. అలా కాని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం కచ్చితంగా చెబుతారు. కాకుంటే కొంచెం టైమ్ పడుతుంది.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju