NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జాకీర్ నాయక్ ఏమన్నాడో విన్నారా కే‌సి‌ఆర్ గారూ?

ఎట్టకేలకు దావూద్ ఇబ్రహీం తమదేశంలోనే ఉంటున్నాడని పాకిస్థాన్ అంగీకరించింది. ప్రపంచం మొత్తానికి తెలిసిన నిజాన్ని ఇన్నాళ్లు బుకాయించిన వారు చివరికి అంగీకరించక తప్పలేదు. ఇప్పుడు దీన్ని వివాదాస్పద మతప్రచారకర్త జాకీర్ నాయక్ ఆసరాగా చేసుకొని కొన్ని బోధనలు చేయడం జరిగింది అదేమిటంటే…

 


అక్కడ డిమాండ్లు.. ఇక్కడ వీడియో

దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాక్ అంగీకరించగానే.. ఇండియా వెంటనే అప్పగించాలని డిమాండ్ చేయాలని.. ఈ దేశం తీసుకువచ్చి శిక్షించాలనే కోరికలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. ఆశ మంచిదే గాని పాకిస్థాన్ పై అలాంటివి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక అతనిని స్వదేశం తీసుకురావాలని సీరియస్ గా ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం జకీర్ నాయక్ గురించి కూడా ఆలోచిస్తుందేమో. ఇక్కడ ఒత్తిడి తట్టుకోలేక మలేషియా పోయి అక్కడి నుండే మత విద్వేషం కొనసాగిస్తున్నాడు. అంతకు ముందు మలేషియా ప్రధాని అతనికి సపోర్ట్ చేస్తున్నాడు కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకు తగ్గట్లు తను విషాన్ని భారత్ పై మరింత కక్కుతున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో అతను పెట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చింది

జకీర్ భాయ్ కు హైదరాబాద్ ప్యార్ హై

జకీర్ చెప్పేది ఏమిటంటే నాలుగైదు సంవత్సరాల్లో ముస్లింలపై సాడుల సాంఖ్య పెరిగిందట. ఇండియాలో దాడులు సాధారణం అయ్యాయి. ఇప్పటి ప్రభుత్వం మతసంబంధ వేధింపులకు పాల్పడుతుతోంది. ఇస్లాంలోని సంప్రదాయాలతో ఇండియన్ ముస్లింలు కీచులాడుకోకుండా అందరూ ఒక్కటిగా ఉండాలి అంతే కాదు వేర్వేరు పార్టీలు, వేర్వేరు సంస్థల వారీగా విడిపోకుండా ముస్లింల కోసమే ప్రత్యేకంగా ఓ పార్టీ ఏర్పాటు చేసుకోవాలట. ఇక ఇలాంటి సమయంలో ఆయన మాట ఏమిటంటే అన్ని కోణాల్లో కేరళ చాలా మేలట. అక్కడి ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు సమానంగా ఉన్నారు…. అక్కడి ప్రజల్లో మత భావనలు తక్కువ పైగా బిజెపికి ఎక్కడ ఎలాంటి ఉనికి లేదు. ఆ విషయానికి వస్తే ఇలా తక్కువ మత భావనలు నగరాల విషయంలో ముంబై కాస్త బెటర్ అని అలాగే హైదరాబాద్ కూడా చాలా మంచి నగరమని జకీర్ అన్నాడు

కేసీఆర్ సాబ్..! బి అలెర్ట్

ఇప్పుడు జాకీర్ హుస్సేన్ అన్న మాటలను కేసీఆర్ ఎలా తీసుకోవాలో అతనికి అర్థం కావడం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ‘సీఎఎ’ ను వ్యతిరేకించే హిందువులు ఎంతమంది ఉన్నారో సమర్థించేవారు కూడా అటు ఇటుగా అంతే మంది ఉన్నారు. వారంతా బిజెపి సపోర్టర్స్ కావచ్చు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ప్రేమించేవారు కావచ్చు. అయితే ఇప్పుడు నాయక్ మాటలతో హైదరాబాద్ లో ఒవైసీ తో కెసిఆర్ కి ఉన్న సాన్నిహిత్యం వలన మత భేదాలు పోయాయి అన్న విషయం తెలిస్ందే. సరే మరి అసలు జాకీర్ హుస్సేన్ హైదరాబాద్ మాట ఎత్తడానికి కెసిఆర్-ఒవైసీ సాన్నిహిత్యం ప్రోద్భలం ఏదైనా ఉందా…? అన్న సందేహాలు వస్తున్నాయి.

హైదరాబాద్లో అంతా కలిసి ఉంటున్నారు. ఇది హర్షించదగ్గ విషయం కానీ కెసిఆర్ పై అది నెగిటివిటీ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ముందు నుండే చాలా మందికి కేసీఆర్-ఒవైసీ తో కలవడం నచ్చట్లేదు. అలాంటి వారు దీనిని ఆసరాగా చేసుకుని నెగిటివిటీ పెంపొందించే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి కేసీఆర్ తస్మాత్ జాగ్రత్త..! ఐకమత్యానికే మనం ఎప్పుడూ పెద్ద పీట వేయాలి మరి…

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju