NewsOrbit
బిగ్ స్టోరీ

అర్ద్రరాత్రి కీ డిస్కషన్స్..రమేష్ కుమార్ జీవో జారీ వెనుక..!!

సుప్రీం కోర్టులో రమేష్ కుమార్ అఫిడవిట్..దారులన్నీ క్లోజ్…కోర్టు చర్యలకు దిగితే మరింత నష్టం.

 

అనేక తర్జన భర్జనలు..సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పుకు లోబడి నిర్ణయం తీసుకోక తప్పలేదు. సుప్రీం తుది తీర్పు వచ్చే వరకూ వేచి చూడాలని భావించినా..గత వారం సుప్రీం చేసిన వ్యాఖ్యలు..హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు..గవర్నర్ సైతం రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలంటూ ఆదేశించటంతో ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది. గత వారం ఈ కేసు విచారించిన సుప్రీం కోర్టు వారం లోగా చేసిన వాదనలకు మద్దతుగా అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. దీంతో..ఆయన గురువారం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసారు. అప్పటి వరకు వేచి చూసిన ప్రభుత్వం..సుప్రీం తుది తీర్పు వచ్చే వరకు వేచి చూస్తూ..ఈ లోగా కోర్టు ధిక్కరణ పిటీషన్ పైన స్టేకు సుప్రీం నిరాకరించిన సమయంలో..అధికారులను బాధ్యులను చేసే అవకాశం ఉందనే చర్చ సాగింది. దీని పైన పెద్ద ఎత్తున మేధో మధనం తరువాత రమేష్ కుమార్ ను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ అర్ధ్రరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, అందులో సుప్రీం తీర్పుకు లోబడి అనే విషయాన్ని స్పష్టం చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతో మొదలై…హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. అయితే స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీం ఇచ్చే తీర్పుకు లోబడే పదవీ పునర్నియామకం ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను తమతో చర్చింకుండా వాయిదా వేయటంతో.. ఆయన పైన ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వం ఎన్నికల సంస్కరణ పేరుతో ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ పదవీ కాలం కుదింపు, కొత్త కమిషనర్‌గా జస్టిస్ కనగరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిమ్మగడ్డ కోర్టును ఆశ్రయించటంతో న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. తిరిగి రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో..హైకోర్టు తీర్పును అమలుచేయట్లేదంటూ నిమ్మగడ్డ కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే దీనిపై స్టే ఇవ్వాలంటూ జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించగా మరోసారి చుక్కెదురైంది. స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.

చివరి నిమిషంలో తప్పని స్థితిలో..సుప్రీంకోర్టులో చెప్పిన విధంగా గురువారం రమేష్ కుమార్ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసారు. గత శుక్రవారం సుప్రీం చేసిన వ్యాఖ్యల తరువాత ఏ రకంగా ముందుకెళ్లాలనే అంశం పైన ముఖ్యమంత్రి స్థాయి లో పెద్ద ఎత్తున చర్చలు సాగాయి. అయితే, ఈ రోజు వరకూ సుప్రీం సమయం నిర్ధేశిస్తూ ఆ లోగా రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలని ఆదేశించింది. దీంతో..30వ తేదీ ముగిసే సమయానికి చివరి నిమిషంలో ఈ జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటికీ ఒక మెట్టు దిగితేనే కోర్టులో ప్రభుత్వం తరపున తదుపరి వాదనలు ఇటు హైకోర్టులో అయినా..అక్కడ సుప్రీంలో అయినా బలంగా వినిపించేందుకు అవకాశం ఉంటుందని..ముందుగా కోర్టు ఆదేశాలు అమలు చేయటం అన్ని రకాలుగా మేలని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించినట్లుగా సమాచారం. దీంతో..సుప్రీం విచారణ ఆగస్టు 4వ తేదీన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించి..హైకోర్టు తీర్పులోని అభ్యంతరాలు…తదుపరి వాదనలు సుప్రీంలో కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో..సుప్రీం తుది తీర్పుకు లోబడి రమేష్ కుమార్ కొనసాగింపు ఆధార పడి ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఒక మెట్టు దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju