వివాదాలతో ఆగిన భారీ చిత్రం

Share


ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలో భారీ బ‌డ్టెట్ చిత్రంగా మ‌హాభార‌తాన్ని సినిమా రూపంలో`మ‌హాభార‌త‌`గా తెర‌కెక్కించాల‌నుకున్నారు. 2016లో ఈ సినిమా గురించి అధికారికంగా మోహ‌న్‌లాల్ ప్ర‌క‌టించారు. యు.ఎ.ఇ కి చెందిన వ్యాపార‌వేత్త బి.ఆర్‌.శెట్టి 1000 కోట్ల రూపాయ‌ల‌తో ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చారు. మ‌ల‌యాళ ర‌చ‌యిత ఎం.టి.వాసుదేవన్‌ నాయ‌ర్ ర‌చించిన `రెండాం మూలం` సినిమాను ఆధారంగా చేసుకుని, శ్రీకుమార్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను తెర‌కెక్కించాల‌నుకున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు, స్క్రిప్ట్ ప‌నులు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ భీముడుగా న‌టిస్తాడ‌ని తెలిపారు. ఆయ‌న‌తో పాటు ఇండియ‌న్ సినిమాలోని అగ్ర న‌టీన‌టుల‌ను ఈ సినిమాలో న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న త‌రుణంలో ద‌ర్శ‌కుడు కుమార్ మీన‌న్‌కు, ర‌చ‌యిత వాసుదేవన్‌ నాయ‌ర్‌కు క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ రావ‌డంతో సినిమా ఆగిపోయింద‌ని నిర్మాత బి.ఆర్‌.శెట్టి తెలిపారు. ప్రెస్టీజియ‌స్‌గా అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఆగిపోవ‌డం సినీ అభిమానుల‌కు నిరాశ క‌లిగించే అంశ‌మే.


Share

Related posts

ఆగ మేఘాల మీద ఆ స్టార్ హీరోయిన్ ని ముంబై నుంచి హైదరాబాద్ రప్పించిన స్టార్ దర్శకుడు ..?

GRK

నాని 25వ చిత్రం`వి` రిలీజ్ డేట్‌

Siva Prasad

బ్రేకింగ్: హీరో అజిత్ ఇంటిలో బాంబ్…? ఫోన్ కాల్ తో అలెర్ట్ అయిన పోలీసులు

arun kanna

Leave a Comment