NewsOrbit
సినిమా

18 Pages: అల‌రిస్తోన్న `18 పేజెస్` గ్లింప్స్.. అంచ‌నాలు పెంచేసిన నిఖిల్‌!

Share

18 Pages: యంగ్ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `18 పేజెస్‌`. పల్నాటి సూర్యప్రతాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

అలాగే డైరెక్ట‌ర్‌ సుకుమార్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాదు.. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. `నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విషయం చెబుతూ ఉండేది.. ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించామంటే ఆన్సర్ ఉండకూడదు` అని నిఖిల్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రిస్తోంది.

కవితలు రాసే యువతి నందినిగా అనుపమ పరమేశ్వరన్, ఆమెను చూడకుండా ఆమె రాసే క‌విత‌ల‌ను చ‌దివే నేటితరం యువకుడు సిద్ధుగా నిఖిల్ క‌నిపించ‌బోతున్నార‌ని గ్లింప్స్ బ‌ట్టీ అర్థ‌మైంది. శ్రద్ధా శ్రీనాథ్ మ‌రో ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. `నన్నయ్య రాసిన కావ్యమాగితే… తిక్కన తీర్చేనుగా. రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా`అంటూ సాగిన‌ నేపథ్య గీతం మ‌రింత ఆక‌ట్టుంది.

మొత్తానికి నిఖిల్ గ్లింప్స్ తోనే సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాడు. మ‌రి సిద్ధు – నందినిల 18 పేజీల ప్రేమ కథ ఏంటో తెలియాలంటే సినిమా విడుద‌ల అయ్యే అవ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. కాగా, నిఖిల్‌-అనుప‌మ‌లు క‌లిసి మ‌రో సినిమా కూడా చేస్తున్నారు. అదే `కార్తికేయ-2`. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నారు. ఈ మూవీ సైతం త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది.


Share

Related posts

Malli Pelli Review in Telugu: నరేష్…. పవిత్ర లోకేష్ జంటగా నటించిన “మళ్లీ పెళ్లి” సినిమా ఫుల్ రివ్యూ..!!

sekhar

విజయ్ దేవరకొండ ప్రైవేట్ పార్టీలో రష్మికకు ఏం పని?

sowmya

Sai pallavi: సాయి పల్లవి కామెడి రోల్స్ చేయాలంటే అందుకు ఒప్పుకోవాలి, ఆ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి..

GRK