పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ చిత్రంలో హీరోయిన్గా కేతికా శర్మ నటించనుంది. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మాతలుగా అనిల్ పడూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న చిత్రం `రొమాంటిక్`. ఈ సినిమా ప్రస్తుతం గోవాలో చిత్రీకరణను జరుపుకుంటుంది.
అందమైన ప్రేమకథా చిత్రం అనీల్ పడూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన ఢిల్లీ మోడల్కెటికా శర్మను హీరోయిన్గా ఎంపిక చేశారు. ప్రస్తుతం జరుగుతున్న గోవా షెడ్యూల్లో కేతికా శర్మ యూనిట్‌తో జాయిన్ అవుతుంది. ఆకాష్ పూరిని దర్శకుడు అనీల్ సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
previous post