Anasuya: అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ.. `సోగ్గాడే చిన్నినాయనా` మూవీతో నటిగా వెండితెరపైకి అడుగు పెట్టింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో.. అనసూయకు మరిన్ని ఆఫర్లు వచ్చాయి.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన `రంగస్థలం` చిత్రంలో రంగమ్మత్తగా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న అనసూయ.. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ నటిగా తనేంటో నిరూపించుకుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ యాంకర్‌గా కొనసాగుతూనే.. మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో అదిరిపోయే ఆఫర్లను పట్టేస్తోంది. ఈమె నటించిన ఆచార్య, పక్కా కమర్షియల్, దర్జా, రంగా మార్తాండ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా అనసూయ చేతిలో ఉన్నాయి.
ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే అనుసూ,.. ప్రతి వారం తన అందచందాలతో నెటిజన్లకు నిద్ర పట్టకుండా చేస్తుంటారు. పెళ్లై ఇద్దరు పుట్టినా.. పదహారేళ్ల అమ్మాయిలా కనిపిస్తూ మిస్మరైజ్ చేస్తుంది.
తాజాగా కూడా మెరూన్ కలర్ ట్రెండీ డ్రస్‌ను ధరించి.. అందాల ఆరబోతలో తన తర్వాతే ఎవరైనా అన్నంతలా స్కిన్ షో చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.