RRR: “KGF 2” రిలీజ్ అయ్యి వారం రోజులు అయింది. వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వారం రోజుల్లోనే 700 కోట్ల సాధించినట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న టాక్. మరో రెండు వారాలు కేజిఎఫ్ సెకండ్ చాప్టర్ కి ఎటువంటి అడ్డంకులు లేవని.. ధియేటర్ లో పూర్తి రన్ టైం లో కచ్చితంగా రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టడం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కేజిఎఫ్ సెకండాఫ్ యాక్టర్ రాక ముందు “RRR” రావడం తెలిసిందే.
మార్చి 25 వ తారీకు విడుదలైన ఈ సినిమా.. రెండు వారాలలోనే భారీ కలెక్షన్లు సాధించడం తో పాటు అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. చాలా ఇండస్ట్రీలలో సరికొత్త రికార్డులు “RRR” తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా 1100 కోట్లకి కలెక్షన్ వెళ్లినట్లు.. “బాహుబలి2″ తర్వాత ఆ తరహాలో…”RRR” కలెక్షన్ సాధించినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా మూడు వారాలలోనే ఈ తరహాలో కలెక్షన్లు సాధించడం మామూలు విషయం కాదని ఈ క్రెడిట్ మొత్తం దర్శక ధీరుడు జక్కన్న కే దక్కుతుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే .. అనుకున్న టైం కంటే ముందుగానే “RRR” ఓటిటీలో కి తీసుకు రావడానికి.. నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్లు మరోపక్క టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా… నెల రోజుల వ్యవధిలో వెయ్యి కోట్లకు పైగానే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు సాధించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకి నార్త్ ప్రేక్షకులు భారీగా కనెక్ట్ అయ్యారు.