దాదాపు మూడు దశాబ్దాల నుండి తెలుగు సినిమా రంగంలో బాలయ్య చిరంజీవి సినిమాల మధ్య పోట పోటీ ఉంది. ఇద్దరు హీరోలు 30 సంవత్సరాల నుండి నువ్వా నేనా అన్నట్టుగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. చిరంజీవి రాజకీయాలకు ముందు పోటీ పడగ తర్వాత 2017లో పొలిటికల్ ఫీల్డ్ నుండి మళ్లీ సినిమాలోకి రియంట్రి ఇచ్చాక బాలయ్య “గౌతమీపుత్ర శాతకర్ణి” కి.. “ఖైదీ నెంబర్ 150” పోటీకి దింపడం జరిగింది. రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
ఇదిలా ఉంటే మళ్లీ ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఇద్దరు టాప్ హీరోలు మళ్లీ బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి రెడీ అయ్యారు. ఈ దసరాకి చిరంజీవి “గాడ్ ఫాదర్”, బాలకృష్ణ “NBK 107” పోటీకి రెడీ అయినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ బాలకృష్ణ సినిమా “NBK 107” కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో.. ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. దీంతో దసరాకి చిరంజీవి..బాలయ్య మధ్య బాక్సాఫీస్ వార్ మిస్ కావడం జరిగింది. కానీ మరోపక్క చిరంజీవి కుర్ర డైరెక్టర్ బాబి దర్శకత్వంలో “CHIRU 154” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయనున్నారట. ఈ పరిణామంతో దసరాకి మిస్సయినా బాక్సాఫీస్ వార్ సంక్రాంతికి చిరంజీవి..బాలయ్య సినిమాలు పోటీ పడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. వచ్చే సంక్రాంతికి వీరిద్దరూ మాత్రమే కాదు ప్రభాస్ ఇంకా త్రివిక్రమ్- మహేష్ సినిమా.. తో పాటు చరణ్ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద బడాబడా సినిమాలు పోటీ పడనున్నట్లు టాక్.