NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: ఎన్టీఆర్ బర్త్ డే నాడు అభిమానులకు బిగ్ అనౌన్స్ మెంట్..!!

Share

NTR 30: “RRR”తో ఎన్టీఆర్ ఇమేజ్ ప్రపంచ స్థాయిలో విస్తరించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన “RRR”… ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసింది. దీంతో మనోడు ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న ప్రాజెక్టు కూడా అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నరు. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి బిగ్ అనౌన్స్ మెంట్ ఎన్టీఆర్ బర్త్ డే నాడు అభిమానులకు ప్రకటించడానికి మేకర్స్ రెడీ అయినట్లు టాక్.

Big announcement for fans on NTR's birthday

మే 20వ తారీకు తారక్ పుట్టినరోజు నేపథ్యంలో… ఈ సినిమా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ కొరటాల శివ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ నీ చాలా పవర్ ఫుల్ రోల్ లో కొరటాల చూపించబోతున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “జనతా గ్యారేజ్” సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమాపై తారక్ అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Big announcement for fans on NTR's birthday

కచ్చితంగా ఈ సినిమా తారక్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిపోవాలని కొరటాల స్క్రిప్ట్ విషయంలో చాలా టైం తీసుకోవడం జరిగింది. పైగా అంతకుముందు కొరటాల తీసిన “ఆచార్య” ఫ్లాప్ కావడంతో ఈ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. “NTR 30” వర్కింగ్ టైటిల్ పేరిట ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొన్ననే వైజాగ్ బీచ్ లో సైఫ్ అలీ ఖాన్.. ఎన్టీఆర్ లపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. అందాల శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఫస్ట్ టైం.. తారక్ సినిమాతో సౌత్ ప్రేక్షకులను పలకరించబోతూ ఉండటంతో…. ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.


Share

Related posts

Naga Chaitanya: అదిరా నాగ చైతన్య అంటే.. బంగారం రా మా వాడు.. సమంత మీద సీరియస్ అవుతోన్న అక్కినేని ఫ్యాన్స్..!

Ram

ఆ దేశంలో మన యువ హీరోకి ఉన్నంత క్రేజ్ ఎవరికీ లేదు..!

Teja

హీరో రవితేజ చిరంజీవి సవతి తల్లి కుమారుడా.. నిజం తెలిసి నెటిజన్ల షాక్!

Ram