ఒకే ఒక్క చిన్న మాట వల్ల భారీ మనస్పర్థలు చోటు చేసుకోవడమే బిగ్ బాస్ స్పెషాలిటీ. ఒకరి మాట మరొకరికి వెళ్తే మొదటికే మోసం వస్తుంది. ఇలా గత సీజన్లో ఎంతోమంది మధ్య వైరం పెరిగి పెద్దది అయింది. ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత కూడా వారు మాట్లాడుకోవడం మానేసిన రోజులు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి పని మోనాల్ రెండవసారి చేయడం వల్ల అభిజిత్ ఆమెకు దూరంగా ఉన్నాడు.
ప్రస్తుతం ఇదే పరిస్థితి సోహెల్- అఖిల్ మధ్య మోనాల్ కల్పించినట్లు తెలుస్తోంది. ఒకచోట మాట్లాడిన మాటలను వేరే దగ్గరికి వెళ్లి చెప్పకు అని సోహెల్ ఆమెకు ముందే చెప్పాడట. ఎవరైనా ఏదైనా మాట్లాడితే నువ్వు విని అది వేరే వాడికి చెప్పకు అది నా గురించి అయినా సరే అని ఆమెకు అర్థమయ్యేలా చెప్పినప్పటికీ చివరికి అదే పని చేసింది మోనాల్.
నామినేషన్ ప్రక్రియ గురించి అఖిల్ – సోహెల్ మాట్లాడుకుంటూ రాత్రి 1:00 అఖిల బాగానే మాట్లాడుకున్నారు. తన మనసులో ఆరీయానా ఒకటే ఉంది రెండో మనిషి గురించి ఆలోచించలేదు అని సోహెల్ అన్నాడు. ఈ సమయంలో అఖిల్ తో చర్చించిన సోహెల్… నోయల్ వద్దకు వెళ్లి ముచ్చటించాడు. అప్పటికే అక్కడ మోనాల్ నోయల్ తో ముచ్చట్లు పెడుతోంది. సోహెల్ వచ్చి నిన్న రాత్రి అఖిల్ తో జరిగిన డిస్కషన్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడి నుంచి మోనాల్ వెళ్ళిపోయింది.
ఇక సోహెల్ ఎక్కడ అని అఖిల్ ఆమెని అడగడంతో నోయల్ దగ్గర నీ గురించి మాట్లాడుతున్నాడు అని వెళ్లి అతని పై చెప్పింది. మోనాల్ చెప్పిన మాట కి అఖిల్ బాగా హర్ట్ అయ్యాడు. నాతో అలా మాట్లాడిన వాడు మళ్లీ నా గురించి వెళ్లి బయట మాట్లాడటం ఏమిటి అని సోహెల్ ను దూరం పెట్టాడు. అతను ఎంత చెప్పినా అఖిల్ పట్టించుకోవడం లేదు.
వెంటనే సోహెల్… మోనాల్ దగ్గరికి వెళ్లి నీకు ముందే చెప్పాను ఒకరి మాటలు మరొకరి దగ్గర చెప్పొద్దని… అక్కడ ఏం మాట్లాడుకుంటున్నామో నీకు తెలియదు.. ఎక్కడున్నాడు అనినదిగితే నాకు తెలియదు అని చెప్పాలి లేదా ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు అని చెప్పాలి అంతేకానీ లేనిపోనివి చెప్పి దూరం పెంచొద్దని ఫైర్ అయ్యాడు. ఇలాంటి పనులు మానివేయమని సూచించాడు.