చిరు కోసం బాలీవుడ్ ద్వ‌యం


మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకు శ‌ర‌వేగంగా రంగం సిద్ధ‌మ‌వుతుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాలో చిరంజీవి డబుల్ షేడ్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తార‌ని, దేవాల‌యాల్లో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై సినిమా క‌థాంశం ఉంటుందని, ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమా సంగీత సార‌థ్యం కోసం బాలీవుడ్ సంగీత ద్వ‌యం అజ‌య్‌-అతుల్‌ల‌తో నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌. పీకే, జీరో, సూప‌ర్ 30 చిత్రాల‌కు సంగీతం అందించారు. వీరు మ‌రాఠీ సెన్సేష‌న‌ల్ హిట్ మూవీ సైర‌ట్‌, తెలుగులో షాక్ చిత్రాల‌కు కూడా సంగీతాన్ని అందించారు.