Pushpa: ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అల్లుఅర్జున్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఓ రేంజ్ లో బన్నీ నటన పుష్ప(Pushpa) లో ఉంది. గంధపు చెక్కల స్మగ్లర్ గా చిత్తూరు(Chittor) యాసలో లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ నటనకు అభిమానుల నుండి మాత్రమే కాక ఇతర సినిమా ప్రేమికుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు పడుతున్న ఈ సినిమా.. సక్సెస్ సంబరాలు అంబరాన్ని అంటేలా సినిమా యూనిట్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సినిమాకి సంబంధించి సక్సెస్ సమావేశంలో అల్లుఅర్జున్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురి అయి.. కన్నీరు పెట్టుకున్నాడు.
“పుష్ప” సినిమా హిట్ అవటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన కెరియర్ లో స్టార్టింగ్ లో సొంతడబ్బుతో స్పోర్ట్స్ కార్ ఇంకా వాచ్ పెట్టుకుని ఫస్ట్ టైం రైడ్ కి వెళ్లిన సమయంలో స్టీరింగ్ మీద చెయ్యి పెట్టిన టైమ్లో నాకు… ఈ స్థితి రావటానికి గల కారణం ఎవరు అని ఆలోచిస్తుంటే మొట్టమొదటగా గుర్తొచ్చిన పేరు సుకుమార్. కెరీర్ ప్రారంభంలో ఏడుగంటల ఆర్య(Aarya) సినిమా చేయకుండా ఉండి ఉంటే.. ఈరోజు ఐకాన్ స్టార్ బన్నీ అనే వాడు ఉండేవాడే కాదు అని కన్నీరు పెట్టుకున్నాడు.
అదే సమయంలో డైరెక్టర్ సుకుమార్(Sukumar) వేదిక ఎదురుగుండా కూర్చున్న టైములో బన్నీ(Bunny) మాట్లాడిన మాటలకు బోరున ఏడ్చేసడు. ఆ రోజు నాకు రెండు దారులు ఉన్నాయి అంటూ బన్నీ ఇంకా మాట్లాడుతూ.. ఒకటి సుకుమార్ ప్రాజెక్టు, మిగతాది ఇండస్ట్రీకి చెందిన మరికొన్ని సినిమాలు. ఆ టైం లో సుకుమార్ ప్రాజెక్టు ఆర్యను ఓకే చేసి హిట్ కొట్టడంతో… ఈరోజు ఇన్ని సినిమాలు చేయడంతో నాకు డిఫరెంట్ క్రేజ్ సుకుమార్… వల్లే వచ్చిందని సగర్వంగా చెబుతున్నాను అంటూ అల్లు అర్జున్(Allu Arjun).. పుష్ప(Pushpa) సక్సెస్ మీట్ లో తెలియజేశారు.