సినిమా

Allu Arjun: మరోసారి యూట్యూబ్ లో తనకి తిరుగులేదు అనిపించుకున్న బన్నీ..!!

Share

Allu Arjun: ఐకాన్ స్టార్ బన్నీ “పుష్ప” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ మాసంలో రిలీజ్ అయి మైండ్ బ్లాక్ కలెక్షన్లు కొల్లగొట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క ప్రమోషన్ కార్యక్రమం చేయకపోయినా గాని… అక్కడి స్టార్ హీరోల సినిమాలకు పోటీ ఇచ్చి వంద కోట్లకు పైగా కలెక్షన్ సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. “పుష్ప”లో బన్నీ డైలాగులు మరియు డాన్స్ అందరినీ ఆకట్టుకోవడం జరిగింది.

bunny two movies albums from tollywood crossed one billion views in youtube

ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ ఇంకా సినిమా సెలబ్రిటీలు చాలామంది పుష్ప సినిమా డైలాగులు బన్నీ స్టెప్స్ సోషల్ మీడియాలో వీడియో రూపంలో చేయడం వైరల్ కావడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇండస్ట్రీ పరంగా ఇంకా సోషల్ మీడియా పరంగా కూడా బన్నీ అనేకసార్లు తనకు తిరుగులేదని నిరూపించడం జరిగింది. “పుష్ప” సినిమా హిందీలో రిలీజ్ అవ్వకముందు.. యూట్యూబ్ లో బన్నీ నటించిన సినిమాలు డబ్ అయి .. లక్షల వ్యూస్ సాధించడం జరిగింది. ఆ ధైర్యంతోనే “పుష్ప” నీ హిందీ లో రిలీజ్ చేసినట్లు అప్పట్లో ఆ సినిమా యూనిట్ కూడా చెప్పడం జరిగింది.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ లో బన్నీ కి తిరుగు లేదని రుజువయింది. విషయంలోకి వెళితే బన్నీ నటించిన అల వైకుంఠపురంలో, పుష్ప రెండు సినిమాల ఆల్బమ్స్ వన్ బిలియన్ వ్యూస్… క్రాస్ చేయడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటువంటి ట్రాక్ రికార్డ్ ఏ హీరోకి లేదు. దీంతో బన్నీ కి సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ ఉంది అని .. తాజా రికార్డు పై సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.


Share

Related posts

Nivisha Black Drees Photos

Gallery Desk

రెస్పాన్స్ అదిరింది

Siva Prasad

Samantha: మంచి ఫామ్ లో వున్న సమంత.. పుష్పని మించి రెచ్చిపోయిందిగా?

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar