GodFather: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “గాడ్ ఫాదర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో కలెక్షన్ ల పరంగా దూసుకుపోతోంది. దసరా పండుగ నాడు వచ్చిన అన్ని సినిమాల కంటే “గాడ్ ఫాదర్” విజయం సాధించడం జరిగింది. రెండు రోజుల వ్యవధిలోనే ₹50కోట్ల మార్క్ దాటేసింది. మొట్టమొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ₹38కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ₹31కోట్ల కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది. దీంతో రెండు రోజుల్లోనే ₹69 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
మోహన్ రాజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి పొలిటికల్ నాయకుడిగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో రెచ్చిపోయారు. ఇక విలన్ పాత్రలో సత్యదేవ్… విశ్వరూపం చూపించాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి పదవి కోసం సత్యదేవ్.. నటన ఇంక .. రాష్ట్రాన్ని కాపాడడానికి ముఖ్యమంత్రి సత్యదేవ్ కాకుండా చిరంజీవి వేసే ప్లాన్స్ చూసే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. మలయాళం లూసిఫర్ సినిమాకి రీమేక్ అయిన గాని ఎంతగానో ఆకట్టుకుంది. “గాడ్ ఫాదర్” ఫస్టాఫ్ స్టోరీ నడిపించిన తీరు ప్రేక్షకులను రక్తి కట్టించింది. సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు… సల్మాన్ ఖాన్ పాత్ర అదనపు ఆకర్షణగా నిలిచాయి.
దీంతో ఈ ఏడాది ప్రారంభంలో “ఆచార్య” తో పరాజయంతో నిరోత్సాహం చెందిన మెగా అభిమానులు “గాడ్ ఫాదర్” విజయంతో సంబరాలు చేసుకుంటున్నారు. చాలాకాలం తర్వాత చిరంజీవిని చాలా పవర్ ఫుల్ పాత్రలో చూపించారని ఫ్యాన్స్ దర్శకుడు మోహన్ రాజా పనితీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారని.. సినిమాకి తగిన న్యాయం చేశారని చెప్పుకొస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా విడుదలైన గాడ్ ఫాదర్ ప్రస్తుతం వసూళ్ల పరంగా విజయవంతంగా థియేటర్ లో దూసుకుపోతుంది.