Salaar Teaser: “బాహుబలి 2” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రభాస్ కెరియర్ నీ పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. 2017వ సంవత్సరం ఏప్రిల్ 28వ తారీకు విడుదల అయినా “బాహుబలి 2” ఇండియాలో అన్ని రికార్డులను బ్రేక్ చేసి.. దేశవ్యాప్తంగా భారీ హిట్ సినిమాగా నిలిచింది. ఒక్క ఇండియాలోనే కాదు ఇతర దేశాలలో కూడా ఈ సినిమా మంచి సత్తా చాటింది. “బాహుబలి 2” ఇతర దేశాలకు చెందిన వాళ్లు చూసిన తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి పెరిగిపోయిందని అప్పట్లో ప్రశంసల వర్షం కురిపించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఈ సినిమా చూసిన ప్రధాని మోడీ… సినిమా మొత్తం అని దగ్గరకు పిలిచి స్వయంగా కలిసి అభినందించడం జరిగింది. “బాహుబలి 2″ తో ఎంతో పేరు తనకి రావడంతో ఇప్పుడు ప్రభాస్ ..”సలర్” టీజర్ కి సంబంధించి.. బాహుబలి సెంటిమెంట్ నమ్మకం ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. మేటర్ లోకి వెళ్తే “బాహుబలి 2″ విడుదలైన రోజు ఏప్రిల్ 28వ తారీఖు నాడు ..”సలర్” టీజర్ విడుదల చేయాలని సినిమా యూనిట్ కి డార్లింగ్ ప్రభాస్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
“బాహుబలి 2″ సెంటిమెంట్ తరహాలో ..”సలార్” కి క్రేజ్ వచ్చేలా..ప్రభాస్ ప్లాన్ చేయడం జరిగిందట. ముఖ్యంగా “కేజిఎఫ్” మేనియాతో దేశవ్యాప్తంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు మారు మ్రోగుతున్న క్రమంలో ….”సలార్” టీజర్ కి “బాహుబలి” టచ్ ఇస్తే సినిమాకి మరింత హైప్ రావటం గ్యారెంటీ అని ప్రభాస్ ఈ ప్లాన్ వేసినట్లు వార్తలు ఇండస్ట్రీలో వినబడుతున్నాయి. “KGF 2” లో ప్రశాంత్ నీల్ హీరో యాష్ ని చాలా బాగా చూపించడం మాత్రమే కాదు …హీరోయిజం పరంగా బాగా ఎలివేషన్ చేయడం జరిగింది. దీంతో ప్రభాస్ ఫాన్స్ “సలార్” పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. “బాహుబలి” తర్వాత చేసిన “సాహో”, “రాధేశ్యాం” రెండూ కూడా పరాజయం కావడంతో.. “సలార్” పై ప్రభాస్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కాలని.. బాగా కష్ట పడటం జరిగింది. దీంతో సెంటిమెంట్ పరంగా “బాహుబలి 2” రిలీజ్ అయిన రోజు “సలార్” టీజర్ విడుదల చేయాలని ప్రభాస్ డిసైడ్ అయినట్లు టాక్.