karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్లో జ్వాలకు నిరుపమ్ ఆటోను కొని గిఫ్ట్ గా ఇవ్వడంతో జ్వల దానికి కృతజ్ఞగా హిమ, ప్రేమ్, నిరుపమ్‌లకు పార్టీ ఇస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో చూద్దామా. నలుగురు కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ హోటల్లో తిని బయటి వస్తారు. ఇక ప్రేమ్ వచ్చి నిరుపమ్, హిమలు క్యాబ్‌లో వెళ్తారు..నీ ఆటోలో ఏం రారు నువ్వు వెళ్ళిపో తిక్క అంటాడు.కానీ జ్వాల మాత్రం ‘లేదు నేనే తీసుకొచ్చాను.. నేనే డ్రాప్ చేస్తాను.. నువ్వు స్కూటీ మీద పో అంటుంది.దాంతో హిమ, నిరుపమ్ ఆటో ఎక్కడానికే సిద్ధపడతారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
karthika Deepam: బైక్ పని చేయడం లేదు అని అబద్దం చెప్పిన ప్రేమ్ :
ప్రేమ్ మాత్రం మనసులో నేను ఏదోటి చేసి వాళ్ళ ఆటోలో హిమ పక్కనే కూర్చుని వెళ్ళాలి అనుకుంటాడు.స్కూటీ పనిచేయడం లేదు నేను కూడా మీతో వస్తాను అని చెప్పి ఆటో ఎక్కుతాడు.ఇక దారిపొడవునా ప్రేమ్, జ్వాలలు ఒకరిని ఒకరు ఏడిపించుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. అలాగే ప్రేమ్.. హిమని, జ్వాల.. నిరుపమ్‌ని ఆటోలోని అద్దంలో చూసుకుని తెగ మురిసిపోతారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మోనితను కధలోకి తీసుకుని వచ్చిన స్వప్న :
మరోపక్క ఆసుపత్రిలో స్వప్న, ఆనందరావులు నిరుపమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే నిరుపమ్, హిమ నవ్వుకుంటూ రావడం చూసిన స్వప్న కోపంతో ఏంట్రా దీన్ని వెంటేసుకుని తిరుగుతున్నావా? ఏమే నా కొడుకుని వదిలిపెట్టావా నువ్వు అంటూ తిడుతుంది.అప్పుడేమో మోనిత కార్తీక్ వెంటపడిపడి ఒక కొడుకుని కని ఇంటి పరువు తీసేసింది. ఆ తర్వాత కార్తీక్, దీపలని నువ్వు పొట్టన పెట్టుకున్నావ్..’ అంటూ హిమను తిడుతుంది.నిరుపమ్ ఎంత చెప్పిన వినదు. హిమ ఏడుస్తూ పక్కకు వెళ్లిపోతుంది. ఆనందరావు బాధగా కళ్లు తుడుచుకుంటాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జ్వల ఫోటోను సౌందర్య చూస్తుందా..?
ఇక మరోవైపు సౌందర్య హిమ రూమ్‌లోకి వెళ్తుంది.ఎదురుగా ఉన్న హిమ, సౌర్యల చిన్నప్పటి ఫొటో చూసి ఆగుతుంది. అయితే దాని వెనుకే రీసెంట్ గా జ్వాల, హిమలు కలిసి దిగిన ఫొటో ఉంటుంది. అది ఎక్కడ చూస్తుందో అని అందరం అనుకుంటాం గాని సౌందర్య మాత్రం చూడదు.ఇంతలో ఫొన్ వచ్చిందని పనిమనిషి చెప్పడంతో ఆ ఫొటోని అక్కడే పెట్టి వెళ్లిపోతుంది సౌందర్య.
జ్వల తెచ్చిన భోజనం తిన్న నిరూపమ్.. కోపంలో. స్వప్న :
ఇక రాత్రి అవ్వడంతో ఆనందరావు భోజనం చేయకుండా నిరుపమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.ఇంతలో నిరుపమ్ వచ్చి.. ‘జ్వాల భోజనం తెస్తే డాడీ ఇంట్లో తినేశాను’ అనడంతో స్వప్న కోపంతో అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి విసిరి కొడుతుంది.దాంతో నిరుమప్..‘అసలు డాడీకి నీకు ఏం గొడవ జరిగింది?’ అంటాడు. ‘అది నేను చెప్పను,నన్ను అగడొద్దు..’ అంటూ మళ్లీ రెచ్చిపోతుంది స్వప్న.సీన్ కట్ చేస్తే.. నిరుపమ్, స్వప్నని కారులో తీసుకుని వెళ్తూ మాట్లాడుకుంటారు. ఇక స్వప్న మాత్రం నిరుపమ్ తో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలిరా.. నేను నీకో మంచి పెళ్లి సంబంధం చూశాను’ అంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నిరూపమ్ కి పెళ్లి సంబంధం చూసిన స్వప్న :
ఆ మాట విని నిరుపమ్ షాక్ అయ్యి అలాంటివేం ఇప్పుడు వద్దు మమ్మీ.. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు’ అంటాడు నిరుపమ్. ఇంతలో కారులోని ‘బ్యాటరీ డౌన్ అయిపోయి ఆగిపోతుంది. ఇంతలో సత్య కారులో అటుగా వచ్చి వాళ్లని చూసి ఆగుతాడు. ‘నేను మెకానిక్‌కి కాల్ చేసి చెబుతానులే.. మీరు నా కారు ఎక్కండి’ అంటాడు సత్య. స్వప్న మాత్రం కోపంగా ‘నేను ఎవరి కారు పడితే వాళ్ల కారు ఎక్కను.నువ్వు వెళ్లు నిరుపమ్.. నేను క్యాబ్‌కి వస్తాను’ అంటుంది. ఆ మాటకు నిరుపమ్ షాక్ అయి చూస్తూ ఉండడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.