NewsOrbit
Featured ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ స్టేజి పై పంచ్ ల వర్షం కురిపించిన హైపర్ ఆది! వామ్మో ఎవరినీ వదల్లేదు..!

Share

ఈ దసరా పండుగ రోజున వీకెండ్ ఎపిసోడ్, బిగ్ బాస్ నాలుగవ సీజన్ ఏడవ వారాంతం చాలా ఘనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమంత హోస్ట్ గా వస్తున్న నేపథ్యంలో ఇంటి సభ్యులు అంతా ఎంతో ఉల్లాసంగా ఆమెతో మాట్లాడారు. ఈ రోజు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఆమె అందరితో చమత్కరించారు. అవినాష్ సమంత పై సెటైర్లు వేయడం హైలైట్గా నిలిచాయి.

ముందుగా మోనాల్, ఆరియానా లను ఉద్దేశించి… అఖిల్, అవినాష్ ల పై సేటర్లు వేసింది. ఆ తర్వాత అవినాష్ తన బలం ప్రేక్షకులు అని చెప్పిన తర్వాత నీకు ఆలోచించుకోడానికి టైం వచ్చింది కదా అని సమంత చెప్పింది. నా దగ్గర వాచ్ కూడా లేదు మేడం టైం ఎలా వస్తుంది అని అంటే నా మీద పంచ్ వేసావు కదా నా ఫ్యాన్స్ నే ఓట్లు తగ్గించేస్తారు చూడు అంటూ అవినాష్ ని బెదిరించింది. అప్పుడు అవినాష్ నేను సమంత యూత్ ప్రెసిడెంట్ లీడర్ అంటూ ఆమెకు జై కొట్టాడు.

ఇలా సాగుతున్న ఈ ఎపిసోడ్ లో మరింత డోస్ పెంచేందుకు స్పెషల్ గెస్ట్ గా హైపర్ ఆది డిటెక్టివ్ రూపంలో వచ్చాడు. ఇంకే ముంది… షో హైప్ అమాంతం పెరిగిపోయింది. వచ్చీరాగానే స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు వచ్చిన పాయల్ రాజ్ పుత్ తెలుగు పై కామెంట్ చేశాడు. లోపల మోనాల్ బయట పాయల్ అంటూ పంచ్ పేల్చాడు. తర్వాత సొహెల్ ను ఉద్దేశించి మాట్లాడుతూ నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నావు కాబట్టి టీవీ లో ఉన్నావు లేదంటే మీ ఇంట్లో టీవీ ముందు కూర్చుని ఉండే వాడివి అని అన్నాడు.

హౌస్ లో మంచి పేరున్న క్యాండిడేట్ అఖిల్ ను ఉద్దేశించి నువ్వు గంగవ్వ లో మీ అవ్వ ని చూసుకున్నావు మరి మోనాల్ లో ఎవరిని చూసుకున్నావు అని అడిగాడు. నేను మోనాల్ ని మోనాల్ లాగానే చూశాను అంటే… మరి ఆమె పెళ్లి గురించి ప్రేమ గురించి నీకు ఎందుకు భయ్యా అన్నాడు. అందుకు అఖిల్ వామ్మో ఇది కూడా టీవీ లో వచ్చిందా అంటూ షాక్ అయ్యాడు.

ఆ తరువాత నోయల్ ను ఉద్దేశించి ప్రపంచంలో ముగ్గురు మనుషులు ఒకరు సీతమ్మవాకిట్లో ప్రకాష్రాజ్, రెండోది బ్రహ్మోత్సవం లో సత్యరాజ్ మూడవది బిగ్ బాస్ ఇంట్లో నోయల్ అని అన్నాడు. ఇలా ఎలిమినేషన్ టెన్షన్ వాతావరణాన్ని హైపర్ ఆది తన పంచులతో నింపేసి పూర్తి ఫన్ గేమ్ గా బిగ్ బాస్ ను మార్చేశాడు.


Share

Related posts

గెలుపు ప్ర‌భాస్ ప‌క్క‌కొచ్చింది

Siva Prasad

సోనూసూద్ కు తెలుగు హీరోలకు మధ్య తేడా అదే: పోసాని

Muraliak

KCR: కేసీఆర్‌కు షాక్‌.. హుజురాబాద్‌లో మారిపోతున్న సీన్‌…

sridhar